రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్‌: 9152007550 (మిస్డ్ కాల్)

సేల్స్: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 సర్వీస్ చాట్: +91 75072 45858

ఇంగ్లాండ్

Claim Assistance
Get In Touch
What are the Benefits of Personal Accident Insurance?
30 మార్చి, 2021

పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ప్రయోజనాలు

ఒక రోజు కునాల్ తన స్నేహితులను కలవడానికి వెళ్లాడు, అక్కడ వారు వివిధ ఇన్సూరెన్స్ పాలసీల గురించి చర్చిస్తుంటారు. అందులో ఒక స్నేహితుడు ఇన్సూరెన్స్ ఏజెంట్ కావడంతో అతను, మిగతావారందరికీ వివిధ ఇన్సూరెన్స్ పాలసీల ప్రయోజనాలను తెలియజేయాలనుకుంటాడు. కునాల్‌ కూడా ఈ విషయాలన్నింటినీ వివరంగా తెలుసుకోవాలనుకుంటాడు. ఎంతో ఆసక్తితో తన ఏజెంట్ స్నేహితుడిని, పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి? అని ప్రశ్నించాడు. ఈ ప్రశ్న అర్థవంతమైనదేనని అతని స్నేహితుడు సంతోషించాడు. జీవితం మనం ఊహించని విధంగా మనల్ని ఆశ్చర్యానికి గురిచేస్తుందని అతను నమ్ముతాడు. కొన్నిసార్లు ఇది మనకు ఇబ్బందికరమైన పరిస్థితులలో నెట్టేస్తుంది లేదా యాక్సిడెంట్స్ లాంటి సంఘటనలతో షాక్‌కు గురిచేస్తుంది. ఒక ప్రమాదం ఎప్పుడైనా, ఎలాంటి హెచ్చరిక లేకుండా సంభవించవచ్చు, గాయపడిన వారికి తీవ్ర హానిని కలిగించవచ్చు, ఇది మీ ఆర్థిక స్థితిని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ఈ పరిస్థితిలో మీకు సహాయపడుతుంది, ఇది మీ సంపాదన సామర్థ్యాన్ని ప్రభావితం చేయదు. చికిత్స ఖర్చులు ఎక్కువగా ఉన్న పరిస్థితిలో లేదా మీకు ఏదైనా వైకల్యం ఉన్నట్లయితే మీకు మరియు మీ కుటుంబానికి ఇది రక్షణ కలిపిస్తుంది. ఇన్సూరెన్స్ ఏజెంట్ ఇలా చెప్పాడు, 'ప్రాథమికంగా; ఈ పాలసీ మీ అన్ని వైద్య ఖర్చులను తిరిగి చెల్లించడానికి సహాయపడుతుంది మరియు ఒక వ్యక్తికి వైకల్యం లేదా ప్రమాదాల కారణంగా మరణం సంభవించిన సందర్భాల్లో పరిహారం అందిస్తుంది.' పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్‌కి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇది శారీరక గాయాలు, ప్రమాదాల కారణంగా మరణం, శాశ్వత పూర్తి వైకల్యం, తాత్కాలిక పూర్తి వైకల్యం లేదా శాశ్వత పాక్షిక వైకల్యాలు వంటి సందర్భాల్లో మీకు లేదా మీ కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందిస్తుంది. కొన్ని సందర్భాల్లో, ఒక ప్రమాదం కారణంగా మాట, అవయవాలు మరియు కళ్ళు కోల్పోయిన సందర్భాలలో ఇన్సూరెన్స్ కంపెనీ పరిహారాన్ని అందిస్తుంది. కునాల్ మరియు అతని స్నేహితులు ఒక యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పాలసీ గురించి ఈ సమాచారం తెలుసుకొని ఆశ్చర్యపోయారు. ఈ రకమైన ఇన్సూరెన్స్ కొనుగోలును విస్మరించవద్దు అని వారి ఏజెంట్ స్నేహితుడు సలహా ఇచ్చాడు. అతను ఈ నిర్దిష్ట కవర్ యొక్క ప్రాముఖ్యతను మరియు దాని పనితీరును వివరించాడు. అతను హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ గురించి కూడా వివరించాడు, ఇది మన ఆరోగ్యానికి సంబంధించి తప్పకుండా పరిగణించవలసిన అంశం.

హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ

కునాల్ ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ గురించి అతని స్నేహితున్ని అడిగాడు. దానికి అతను సమాధానం ఇస్తూ, ఇది వారి జీవితంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది అని వివరించాడు. సంస్థ ద్వారా కొన్ని అవసరమైన ప్రయోజనాలు పేషంట్‌కు అందుతాయి. పాలసీహోల్డర్ హాస్పిటలైజేషన్ ఖర్చులు, డాక్టర్ యొక్క కన్సల్టేషన్ ఫీజు మరియు తీవ్రమైన అనారోగ్యాల విషయంలో ఔషధాల ఖర్చులకు సంబంధించిన వ్యయాలను పొందుతాడు. "హెల్త్ ఇన్సూరెన్స్ కవర్ లాగానే పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కూడా ముఖ్యం," అని కునాల్ చెప్పాడు.

పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ యొక్క ప్రయోజనాల జాబితా

కునాల్ స్నేహితుడు ఈ కవర్ యొక్క కొన్ని ముఖ్యమైన ప్రయోజనాల జాబితాతో పాటుగా పూర్తి వివరణను అందించాడు.
  • మెడికల్ టెస్టులు లేవు
ఇది ఈ పాలసీ యొక్క ముఖ్యమైన ప్రయోజనాల్లో ఒకటి, ఇందులో మీరు ఎటువంటి వైద్య పరీక్షలు చేయించుకోవలసిన అవసరం లేదు.
  • కుటుంబ భద్రత
కుటుంబం అంటే మన అందరికీ ఇష్టం, అలాగే, మనం అందరం కూడా మన కుటుంబం యొక్క ఆర్థిక భద్రతను గురించి ఆందోళన చెందుతాము. కాబట్టి, ఈ పాలసీ కవర్ మన కుటుంబ సభ్యులకు పరిహారం రూపంలో భద్రతను ఇస్తుంది లేదా ప్రమాదం కారణంగా గాయపడిన లేదా వైకల్యానికి గురైన సందర్భంలో చికిత్స కోసం అయ్యే అన్ని ఖర్చులను భరిస్తుంది.
  • మనశ్శాంతి
ఇది మీకు మనశ్శాంతిని ఇస్తుంది, ఎందుకనగా కుటుంబ సభ్యులు తమ బాధ్యతలను చెల్లించడానికి మరియు కుటుంబ సభ్యుల మరణం విషయంలో సాధారణ జీవనశైలిని నిర్వహించడానికి కంపెనీ అందించే ఈ పరిహారాన్ని ఉపయోగించుకోవచ్చు.
  • అతి తక్కువ డాక్యుమెంటేషన్
ఇన్సూరెన్స్ కవర్‌ క్లిష్టమైన ప్రక్రియను కలిగి ఉంటుంది అనే అపోహ ఉంది. అందువల్ల, ప్రజలు దానిని కొనుగోలు చేయడాన్ని నివారిస్తారు. కానీ వాస్తవం ఏమిటంటే, ఈ పాలసీని మీరు కొనుగోలు చేసినప్పుడు ఇందులో ఎక్కువ పేపర్‌వర్క్ ఉండదు. అప్లికేషన్ ఫారంలో అవసరమైన వివరాలు మాత్రమే అందించవలసి ఉంటుంది, కాబట్టి మీరు డాక్యుమెంటేషన్ ప్రక్రియ గురించి ఆందోళన చెందవలసిన అవసరం లేదు.
  • అంబులెన్స్ ఖర్చులు
అనేక ఇన్సూరెన్స్ కంపెనీలు, ప్రమాదవశాత్తు గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తీసుకువెళ్లేటప్పుడు అయ్యే అంబులెన్స్ ఖర్చులను కూడా కవర్ చేస్తాయి. వారు కూడా మీ యాక్సిడెంట్ సంబంధిత సమాచారాన్ని మీ కుటుంబ సభ్యులకు చేరవేస్తారు.
  • ప్రపంచవ్యాప్త కవరేజ్
భారతదేశం వెలుపల ప్రాణాపాయం సంభవించినప్పుడు, కొన్ని ఇన్సూరెన్స్ సంస్థలు పరిహారాన్ని అందించవు. కానీ, ప్రమాదం జరిగిన ప్రదేశంతో సంబంధం లేకుండా పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పాలసీ కవర్, అన్ని హామీఇవ్వబడిన ప్రయోజనాలను అందిస్తుంది. దీనికి ఎలాంటి భౌగోళిక పరిమితులు ఉండవు మరియు ఇది అత్యవసర సందర్భాల్లో సహాయపడుతుంది.
  • సులభమైన క్లెయిమ్ ప్రాసెస్
ఇందులో ఒక సులభమైన క్లెయిమ్ ప్రక్రియ ఉంటుంది, ఇది పాలసీ కొనుగోలుదారుకు అత్యంత ముఖ్యమైన అంశం, ఎందుకంటే సుదీర్ఘమైన ప్రక్రియ ఉంటే అత్యవసర పరిస్థితులలో ఒకరు ఇన్సూరెన్స్‌ను క్లెయిమ్ చేయలేరు. ఇక్కడ, మీరు ఇన్సూర్ చేయబడిన ఇన్సూరెన్స్ యొక్క ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ అప్లికేషన్‌ను సమర్పించవచ్చు, కంపెనీ దానిని ధృవీకరిస్తుంది మరియు క్లెయిమ్ చెల్లించబడుతుంది. పర్సనల్ యాక్సిడెంట్ పాలసీ మీ ప్రీమియంను తగ్గించడానికి కోపే వంటి మరిన్ని ప్రయోజనాలను కూడా అందిస్తుంది, క్యుములేటివ్ బోనస్ resulting in higher ఇన్సూర్ చేయబడిన మొత్తం అందించే క్యుములేటివ్ బోనస్ మరియు ఇటువంటి మరిన్ని ప్రయోజనాలను అందిస్తుంది.  తరచుగా అడిగే ప్రశ్నలు
  • పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ రకాలు ఏమిటి?
స్థూలంగా రెండు రకాల ఇన్సూరెన్స్‌లు ఉంటాయి, అవి వ్యక్తిగత పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సురెన్స్ మరియు గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్.
  • పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ వలన కలిగే ప్రయోజనాలు ఏవి?
పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ అనేక ప్రయోజనాలను కలిగి ఉంటుంది. మీకు లేదా మీ కుటుంబానికి ఏదైనా జరిగితే ఇది మీ కుటుంబానికి రక్షణ మరియు భద్రతను అందిస్తుంది. ప్రమాదాలు జరిగిన సందర్భంలో మీకు ఆర్థికంగా సహాయం అందిస్తుంది. ఒక ప్రమాదం వైకల్యం లేదా మరణానికి దారితీస్తే, అది మీ ఆదాయంపై ఒక అవాంఛనీయ ప్రభావాన్ని చూపుతుంది. కానీ ఈ దురదృష్టకరమైన సమయాల్లో అయిన ఖర్చులను పర్సనల్ యాక్సిడెంట్ కవర్ నెరవేరుస్తుంది.

ఈ ఆర్టికల్ ఉపయోగకరంగా ఉందా? రేటింగ్ ఇవ్వండి

సగటు రేటింగ్ 5 / 5. ఓట్ల లెక్కింపు: 18

ఇప్పటివరకు ఏ ఓట్లు లేవు! ఈ పోస్ట్‌కు రేటింగ్ ఇచ్చే మొదటి వ్యక్తి అవ్వండి.

ఈ ఆర్టికల్ మీకు నచ్చిందా?? మీ స్నేహితులతో షేర్ చేయండి!

మీ ఆలోచనలను షేర్ చేయండి. దిగువన మీ అభిప్రాయం తెలపండి!

రిప్లై ఇవ్వండి

మీ ఇమెయిల్ అడ్రస్ ప్రచురించబడదు. దయచేసి అన్ని వివరాలను పూరించండి