రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్‌: 9152007550 (మిస్డ్ కాల్)

సేల్స్: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 సర్వీస్ చాట్: +91 75072 45858

ఇంగ్లాండ్

Claim Assistance
Get In Touch
Guide to What's Not Covered in a Health Insurance Plan
ఫిబ్రవరి 5, 2021

కమర్షియల్ జనరల్ లయబిలిటీ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి?

ఒక వ్యాపారాన్ని విజయవంతంగా అభివృద్ధి చేయడానికి అనేక సంవత్సరాల కృషి మరియు పట్టుదల అవసరం. అలాగే, మీ వ్యాపారం యొక్క ప్రఖ్యాతి కస్టమర్లు మరియు ఉద్యోగులతో సహా మీ వాటాదారుల విశ్వాసం పై ఆధారపడి ఉంటుంది. కానీ అసంతృప్తికి లోనయిన ఉద్యోగులు లేదా కస్టమర్ల ద్వారా చేయబడిన క్లెయిమ్‌ల వలన ఉత్పన్నమయ్యే ఆర్థిక బాధ్యత కారణంగా ఈ ప్రఖ్యాతి ప్రభావితం అవ్వచ్చు. ఈ క్లెయిమ్‌లను పరిష్కరించడం మీ నగదు ప్రవాహాలను దెబ్బతీయవచ్చు మరియు సాధారణ వ్యాపార కార్యకలాపాలకు ఆటంకాలు కలిగించవచ్చు. ఈ పరిస్థితిలో, అటువంటి ఊహించని సంఘటనల నుండి మీ వ్యాపారాన్ని రక్షించడానికి కమర్షియల్ జనరల్ లయబిలిటీ ఇన్సూరెన్స్ కలిగి ఉండటం వరంగా మారవచ్చు.  

కమర్షియల్ జనరల్ లయబిలిటీ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి?

కమర్షియల్ ఇన్సూరెన్స్ పాలసీ అయిన కమర్షియల్ జనరల్ లయబిలిటీ ఇన్సూరెన్స్ అనేది వాటాదారులకు పరిహారం చెల్లించడంతో సహా మీ వ్యాపారాన్ని చట్టపరమైన జవాబుదారీతనం నుండి రక్షిస్తుంది. అన్ని సంస్థలకు వారి వ్యాపారం మరియు ఆర్థిక ఆసక్తులకు రక్షణను అందించడానికి ఈ ఇన్సూరెన్స్ అవసరం. పబ్లిక్ లయబిలిటీ మరియు ప్రోడక్ట్ లయబిలిటీ పై చేసిన ఏవైనా క్లెయిములు కమర్షియల్ జనరల్ లయబిలిటీ ఇన్సూరెన్స్ పాలసీ క్రింద కవర్ చేయబడతాయి. ఉదాహరణకు, ఒక క్లయింట్ మీ తయారీ సౌకర్యాన్ని సందర్శిస్తారు మరియు ప్రాంగణంలో పర్యటిస్తున్నప్పుడు, వైర్లు అడ్డం రావడంతో అతను కింద పడి గాయాల పాలు అవుతాడు. క్లయింట్ మీ వ్యాపారానికి వ్యతిరేకంగా అజాగ్రత్త క్లెయిమ్ ఫైల్ చేయవచ్చు మరియు భారీ మొత్తంలో పరిహారం కోరవచ్చు. కమర్షియల్ జనరల్ లయబిలిటీ ఇన్సూరెన్స్ మీ సంస్థ కోసం అటువంటి ఆర్థిక నష్టాలను నివారించడానికి సహాయపడుతుంది.  

కమర్షియల్ జనరల్ లయబిలిటీ ఇన్సూరెన్స్ ద్వారా ఏ రకమైన బాధ్యతలు కవర్ చేయబడతాయి?

కమర్షియల్ జనరల్ లయబిలిటీ ఇన్సూరెన్స్ వివిధ రకాల లయబిలిటీలను కవర్ చేస్తుంది:   ప్రోడక్ట్ లయబిలిటీ: ప్రోడక్ట్ లయబిలిటీ అంటే ఒక సంస్థ అందించే తక్కువ నాణ్యత కలిగిన ఉత్పత్తులు లేదా సేవల కారణంగా ఏర్పడే లయబిలిటీ.   పబ్లిక్ లయబిలిటీ: మరోవైపు, పబ్లిక్ లయబిలిటీ, వ్యాపార ప్రాంగణంలో జరిగిన హాని లేదా నష్టాలతో సహా థర్డ్-పార్టీ యొక్క చట్టపరమైన చర్యల నుండి ఒక సంస్థను ఇన్సూర్ చేస్తుంది.   ప్రోడక్ట్ రీకాల్: ఒక ప్రోడక్ట్ రీకాల్ అనేది ఒక అసాధారణ పరిస్థితి, ఇందులో సాంకేతిక కారణాల వల్ల తయారు చేయబడిన ఉత్పత్తులను రీకాల్ చేయవలసి ఉంటుంది. ఇది సాధారణంగా ఆటోమొబైల్ రంగంలో జరుగుతుంది. ఒక రీకాల్ మీ ఫైనాన్సులపై ప్రభావం చూపవచ్చు, కానీ అదే సమయంలో, ఆ ఉత్పత్తులను వెనక్కి రప్పించడం కూడా అవసరం. మీరు ఖచ్చితంగా మీ కస్టమర్లకు దెబ్బతిన్న లేదా లోపభూయిష్టమైన యూనిట్లను సరఫరా చేసి మీ బ్రాండ్ ప్రఖ్యాతిని చెడగొట్టుకోవాలని అనుకోరు. ఒక ప్రోడక్ట్ రీకాల్ నుండి ఉత్పన్నమయ్యే ఆర్థిక ఇబ్బంది గురించి మీరు ఆందోళన చెందవలసిన అవసరం లేకుండా మరియు నాణ్యమైన ఉత్పత్తులను అందించడం పై దృష్టి పెట్టే విధంగా ఒక బిజినెస్ లయబిలిటీ కవర్ నిర్ధారిస్తుంది.   కార్మికుల పరిహారం: కార్మికశక్తి ఏ వ్యాపారంలోనైనా ముఖ్యమైన భాగం. కమర్షియల్ జనరల్ లయబిలిటీ ఇన్సూరెన్స్ పొందడం వలన వ్యాపారం చట్టపరమైన ఆవశ్యకతలను నెరవేర్చడమే కాక వృత్తిపరమైన ప్రమాదాలు లేదా గాయాలు జరిగిన సందర్భంలో ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. పైన పేర్కొన్న బాధ్యతలు కాకుండా ఆహారం, కాస్మెటిక్ మరియు ఫార్మాస్యూటికల్ కంపెనీలలో క్లినికల్ ట్రయల్స్ పాల్గొనేవారు చేసిన క్లెయిమ్‌లు కూడా కమర్షియల్ జనరల్ లయబిలిటీ ఇన్సూరెన్స్ కింద కవర్ చేయబడతాయి. మీ వ్యాపారం కోసం లయబిలిటీ ఇన్సూరెన్స్ పొందడం వలన ఆర్థిక ఎదురుదెబ్బల నుండి సంస్థకు సమగ్ర రక్షణ లభిస్తుంది. ఒక బిజినెస్ లయబిలిటీ ఇన్సూరెన్స్ సంస్థకు రక్షణను అందించే ఉదాహరణలు ఇక్కడ ఇవ్వబడ్డాయి:
  • సంస్థ ప్రాంగణంలో సంభవించే ప్రమాదాల నుండి.
  • లోపభూయిష్టమైన/తక్కువ నాణ్యత కలిగిన ఉత్పత్తులు/సేవల కారణంగా జరిగిన నష్టాల నుండి.
  • థర్డ్ పార్టీకి గాయం జరిగిన సందర్భంలో భరించవలసిన వైద్య ఖర్చుల నుండి.
  • సాధారణ కార్యకలాపాలను నిర్వహించేటప్పుడు గాయపడిన సందర్భంలో ఉద్యోగులకు పరిహారం అందించడం.
  కాబట్టి, వివేకవంతులు అవ్వండి మరియు మీ సాధారణ వ్యాపార కార్యకలాపాల సమయంలో అవాంఛనీయ ఆర్థిక బాధ్యత నుండి మీ సంస్థను రక్షించడానికి కమర్షియల్ జనరల్ లయబిలిటీ ఇన్సూరెన్స్ పొందండి. *ప్రామాణిక నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి ఇన్సూరెన్స్ అనేది ఆసక్తి అభ్యర్థనకు సంబంధించిన విషయం. ప్రయోజనాలు, మినహాయింపులు, పరిమితులు, నిబంధనలు మరియు షరతుల గురించి మరిన్ని వివరాల కోసం, దయచేసి విక్రయాన్ని ముగించే ముందు సేల్స్ బ్రోచర్/పాలసీ వర్డింగ్‌ను జాగ్రత్తగా చదవండి.

ఈ ఆర్టికల్ ఉపయోగకరంగా ఉందా? రేటింగ్ ఇవ్వండి

సగటు రేటింగ్ 5 / 5. ఓట్ల లెక్కింపు: 18

ఇప్పటివరకు ఏ ఓట్లు లేవు! ఈ పోస్ట్‌కు రేటింగ్ ఇచ్చే మొదటి వ్యక్తి అవ్వండి.

ఈ ఆర్టికల్ మీకు నచ్చిందా?? మీ స్నేహితులతో షేర్ చేయండి!

మీ ఆలోచనలను షేర్ చేయండి. దిగువన మీ అభిప్రాయం తెలపండి!

రిప్లై ఇవ్వండి

మీ ఇమెయిల్ అడ్రస్ ప్రచురించబడదు. దయచేసి అన్ని వివరాలను పూరించండి