Loader
Loader

రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్‌: 9152007550 (మిస్డ్ కాల్)

సేల్స్: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 Whatsapp Logo సర్వీస్ చాట్: +91 75072 45858

Claim Assistance
  • క్లెయిమ్ అసిస్టెన్స్ నంబర్లు

  • హెల్త్ టోల్ ఫ్రీ నంబర్ 1800-103-2529

  • 24x7 రోడ్‌సైడ్ అసిస్టెన్స్ 1800-103-5858

  • మోటార్ క్లెయిమ్ రిజిస్ట్రేషన్ 1800-209-5858

  • మోటార్ ఆన్ ది స్పాట్ 1800-266-6416

  • గ్లోబల్ ట్రావెల్ హెల్ప్‌లైన్ +91-124-6174720

  • పొడిగించబడిన వారంటీ 1800-209-1021

  • అగ్రి క్లెయిమ్స్ 1800-209-5959

Get In Touch

మా వెబ్‌సైట్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు.

ఏదైనా సహాయం కోసం దయచేసి 1800-209-0144 కు కాల్ చేయండి

సమగ్ర కార్ ఇన్సూరెన్స్

Comprehensive Car Insurance

సమగ్ర కార్ ఇన్సూరెన్స్

కారు కొనుగోలు చేయడం అద్భుతంగా ఉంటుంది. కారు కొనుగోలు చేయడమనేది ఒక పెద్ద ఆర్థిక నిర్ణయం మరియు దాని కొనుగోలు అనేది భావోద్వేగాలతో ముడిపడిన విషయంగా ఉంటుంది. మీరు ఒక కారు యజమాని అయితే లేదా కారును కొనాలనుకుంటే, మీకు ఏ రకమైన మోటార్ ఇన్సూరెన్స్ పాలసీ అనుకూలంగా ఉంటుందో అర్థం చేసుకోవడం ముఖ్యం.

భారతదేశంలో, థర్డ్-పార్టీ ఇన్సూరెన్స్ తప్పనిసరి. అది లేకుండా, ఎవరైనా పట్టుబడితే, వారు చట్టపరమైన పరిణామాలకు బాధ్యత వహించాల్సి ఉంటుంది. కొన్నిసార్లు, చట్టానికి కట్టుబడకపోవడం అనేది డ్రైవింగ్ లైసెన్స్ అనర్హతకు దారితీయవచ్చు. సమగ్ర ఇన్సూరెన్స్ అనేది యాక్సిడెంట్ లేదా దుర్ఘటన కారణంగా వాహనానికి జరిగే ఏవైనా నష్టాలకు మరమ్మత్తు/మార్పిడి కోసం కవర్ అందిస్తుంది. కాబట్టి, మీరు కారు యజమాని లేదా త్వరలో కారు కొనే ప్లాన్‌తో ఉంటే, సమగ్ర కారు ఇన్సూరెన్స్‌ను కొనుగోలు చేయడం మర్చిపోకండి.

Scroll

సమగ్ర కార్ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి?

ఒక సమగ్ర కార్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది ఏదైనా థర్డ్-పార్టీ బాధ్యత, దుర్ఘటన వల్ల ఏర్పడే నష్టం, ప్రకృతి లేదా మానవ జోక్యంతో జరిగే విపత్తు మొదలైన వాటి నుండి కవర్ అందిస్తుంది. సమగ్ర ఇన్సూరెన్స్ కలిగి ఉండడమనేది విస్తృత కవరేజీ అందిస్తుంది. 

✓ ఇది థర్డ్-పార్టీ లయబిలిటీ కవర్ అనే అదనపు ప్రయోజనం అందిస్తుంది

✓ అవసరాలకు అనుగుణంగా, పాలసీదారు తన ప్లాన్‌ను సులభంగా కస్టమైజ్ చేయవచ్చు

✓ యాడ్-ఆన్ రైడర్ల శ్రేణి నుండి ఎంచుకునేందుకు ఎంపిక

సమగ్ర కార్ ఇన్సూరెన్స్ కవరేజ్ కలిగి ఉండడమనేది కారుకు సంపూర్ణ రక్షణ అందిస్తుంది మరియు ఏవైనా ఊహించని పరిస్థితుల నుండి రక్షణను నిర్ధారిస్తుంది. మనలో చాలామంది విషయంలో, ఫోర్-వీలర్ కొనుగోలు అనేది ఒక కలగా మరియు ఖరీదైన డీల్‌గా ఉంటుంది. ప్రతికూలత అనేది ఎప్పుడూ చెప్పి రాదు అని మనందరికీ తెలుసు మరియు భారతదేశ రహదారులనేవి అత్యంత అనిశ్చిత ప్రదేశాల్లో ఒకటిగా ఉంటున్నాయి.

చిన్న డెంట్ నుండి మైనర్/మేజర్ యాక్సిడెంట్ వరకు మీరు స్వంతంగా భారీగా ఖర్చు చేయాల్సి రావచ్చు. కాబట్టి, ఒక సమగ్ర మోటార్ ఇన్సూరెన్స్ పాలసీ is extremely important. To avoid any confusion, you may also సమగ్ర కార్ ఇన్సూరెన్స్ కోట్‌లను ఆన్‌లైన్‌లో సరిపోల్చండి.

సమగ్ర కార్ ఇన్సూరెన్స్ పాలసీ ఫీచర్లు 

బజాజ్ అలియంజ్ సమగ్ర కార్ ఇన్సూరెన్స్ పాలసీ అందించే క్రింది ఫీచర్లు దానిని ఒక గొప్ప పాలసీగా చేస్తాయి:

  •  Cover for Third-Party Liability: థర్డ్-పార్టీ లయబిలిటీ కోసం కవర్:

    ఒక సమగ్ర ప్లాన్ క్రింద కారు కవర్ చేయబడినప్పుడు, మూడవ వ్యక్తికి ఏదైనా నష్టం జరిగితే పాలసీదారు సులభంగా క్లెయిమ్ ఫైల్ చేయవచ్చు. లేదా ఇన్సూర్ చేయబడిన కారు వలన ఆస్తికి జరిగిన నష్టం. అటువంటి ఏదైనా ప్రమాదం కారణంగా తలెత్తే ఏదైనా చట్టపరమైన బాధ్యతకు కూడా ఇది కవర్ అందిస్తుంది. బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ అనేది సులభమైన మరియు అవాంతరాలు-లేని సమగ్ర కార్ ఇన్సూరెన్స్ ఆన్‌లైన్ క్లెయిమ్ ప్రాసెస్‌ను అందిస్తుంది. 

  • Personal Accident Cover పర్సనల్ యాక్సిడెంట్ కవర్

    రూ. 15 లక్షల పర్సనల్ యాక్సిడెంట్ కవర్ కూడా మేము అందిస్తాము*. ఏదైనా అవాంఛనీయ ప్రమాదం కారణంగా తలెత్తే అన్ని హాస్పిటలైజేషన్ ఖర్చులను ఇది అందిస్తుంది. వాహనానికి సంబంధించి ఇన్సూర్ చేయబడిన యజమాని-డ్రైవర్‌కి సంభవించే ఏదైనా శారీరక గాయం లేదా మరణం కోసం క్రింది పట్టికలోని స్కేల్ ప్రకారం పరిహారం అందించబడుతుంది

    గాయం స్వభావం

    పరిహారం స్కేల్

    ఒక అవయవం లేదా ఒక కంటి చూపు కోల్పోవడం

    ఇన్సూర్ చేయబడిన మొత్తంలో 50%

    రెండు అవయవాలు లేదా రెండు కళ్ళలో చూపు కోల్పోవడం లేదా ఒక అవయవం మరియు ఒక కంటిలో చూపు కోల్పోవడం

    ఇన్సూర్ చేయబడిన మొత్తంలో 100%

    గాయాల కారణంగా శాశ్వత పూర్తి వైకల్యం*

    ఇన్సూర్ చేయబడిన మొత్తంలో 100%

    మరణం

    ఇన్సూర్ చేయబడిన మొత్తంలో 100%

    డిస్‌క్లెయిమర్: మరింత సమాచారం కోసం, దయచేసి పాలసీ నిబంధనలను జాగ్రత్తగా చదవండి. *ప్రామాణిక నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి

  • Own Damage Cover ఓన్ డ్యామేజ్ కవర్

    అగ్నిప్రమాదం, దోపిడీ, అల్లర్లు, సమ్మె, వరద, టైఫూన్ మొదలైన వాటి కారణంగా ఇన్సూర్ చేయబడిన కారుకు జరిగిన నష్టం/డ్యామేజీకి ఇన్సూరర్ కవర్ అందిస్తారు. కారు మరమ్మత్తు చేయడానికి అయ్యే మొత్తం ఖర్చులు మీకు ఆర్థిక ఇబ్బందులను కలిగిస్తాయి కాబట్టి, ఉత్తమ సమగ్ర కార్ ఇన్సూరెన్స్ పాలసీ ఎంచుకోండి.

  • Add-on Rider Options యాడ్-ఆన్ రైడర్ ఎంపికలు

    బేస్ ప్లాన్ లోపల అందించబడే ప్రస్తుత కవరేజ్‌ను మెరుగుపరచడానికి, మీరు యాడ్-ఆన్‌లను పరిగణనలోకి తీసుకోవచ్చు మరియు ప్లాన్‌ను మరింత మెరుగుపరచవచ్చు. తగిన కార్ ఇన్సూరెన్స్ యాడ్-ఆన్ రైడర్ ఎంపికలు ఎంచుకోండి మరియు ప్లాన్‌ను సంపూర్ణంగా చేయండి. ఏదైనా అత్యవసర పరిస్థితిలో మీకు సహాయంగా, కారు ఇంజిన్‌ను రక్షించడం కోసం, యాడ్-ఆన్ రైడర్ ఎంపిక అనేది వివిధ అవసరాలను తీరుస్తుంది. ఇది ఇన్సూరర్ నుండి ఇన్సూరర్‌కు మారవచ్చు

    *ప్రామాణిక నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి

మా వద్ద సమగ్ర కార్ ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ కొనండి. మరింత తెలుసుకోవడానికి వీడియోను చూడండి

సమగ్ర కార్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయడానికి ప్రాసెస్ ఏమిటి?

నగదురహిత సమగ్ర ఇన్సూరెన్స్ క్లెయిమ్

 

నగదురహిత క్లెయిమ్ సదుపాయంతో, ఏదైనా నష్టం జరిగిన సందర్భంలో ఇన్సూర్ చేయబడిన వ్యక్తి తన జేబు నుండి ఎలాంటి ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదు. ఇన్సూరెన్స్ కంపెనీ నేరుగా నెట్‌వర్క్ గ్యారేజీ లేదా వర్క్‌షాప్‌లో ఈ బిల్లులను సెటిల్ చేస్తుంది. రికవరీ ప్రాసెస్ అనేది ఖచ్చితంగా వెహికల్ ఇన్సూరెన్స్ పాలసీలో పేర్కొన్న క్రమంలోనే జరుగుతుంది. 

నగదురహిత కార్ ఇన్సూరెన్స్ క్లెయిమ్‌ల ప్రయోజనం పొందడానికి క్రింది దశలు అనుసరించండి:

✓ వీలైనంత త్వరగా ఇన్సూరెన్స్ కంపెనీకి తెలియజేయండి. మీరు ఇన్సూరర్ వెబ్‌సైట్‌ను కూడా సందర్శించవచ్చు లేదా మొబైల్ యాప్ ద్వారా నగదురహిత క్లెయిమ్‌ను రిజిస్టర్ చేసుకోవచ్చు

✓ విజయవంతమైన రిజిస్ట్రేషన్ తర్వాత, క్లెయిమ్ రిజిస్ట్రేషన్ నంబర్ అందుకుంటారు

✓ మరమ్మత్తు ప్రక్రియను ప్రారంభించడానికి దెబ్బతిన్న కారును సమీపంలోని నెట్‌వర్క్ గ్యారేజీ కి తీసుకెళ్లండి. నగదురహిత ప్రయోజనం పొందడానికి, కారును నెట్‌వర్క్ గ్యారేజీకి మాత్రమే తరలించాలి

✓ అవసరమైన డాక్యుమెంట్లను సర్వేయర్‌కు సమర్పించాలి

✓ సర్వే పూర్తయిన తర్వాత, బాధ్యతను ఇన్సూరర్ నిర్ధారిస్తారు

రీయింబర్స్‌మెంట్ సమగ్ర ఇన్సూరెన్స్ క్లెయిమ్

దాని క్రింద, జరిగిన నష్టాల కోసం ఇన్సూర్ చేయబడిన వ్యక్తి ముందుగా వారి జేబు నుండి ఖర్చు చేయాలి. డాక్యుమెంట్లు, బిల్లులు ధృవీకరించిన తర్వాత మరియు కవరేజ్ గురించి అర్థం చేసుకున్న తర్వాత, ఆ ఖర్చులను ఇన్సూరెన్స్ కంపెనీ తిరిగి చెల్లిస్తుంది.

మోటార్ ఇన్సూరెన్స్ క్లెయిమ్‌ను విజయవంతంగా రీయింబర్స్‌ చేసుకోవడానికి దశలు క్రింద ఇవ్వబడ్డాయి:

✓ ఇన్సూరెన్స్ కంపెనీని సంప్రదించండి లేదా ఇన్సూరర్ వెబ్‌సైట్‌ను సందర్శించండి. మీరు మొబైల్ యాప్ ద్వారా కూడా రీయింబర్స్‌మెంట్ క్లెయిమ్‌ను రిజిస్టర్ చేయవచ్చు

✓ విజయవంతమైన రిజిస్ట్రేషన్ తర్వాత, క్లెయిమ్ రిజిస్ట్రేషన్ నంబర్ అందించబడుతుంది

✓ మరమ్మత్తు ప్రక్రియ ప్రారంభించడం కోసం పాడైన కారును సమీప గ్యారేజీకి తరలించండి. అలాంటి సందర్భంలో, కారును నెట్‌వర్క్ గ్యారేజీకి తీసుకువెళ్లడం తప్పనిసరి కాదు

✓ డాక్యుమెంట్లను సర్వేయర్‌కు సమర్పించాలి

✓ సర్వే పూర్తయిన తర్వాత, బాధ్యతను ఇన్సూరర్ నిర్ధారిస్తారు మరియు రీయింబర్స్‌మెంట్ ప్రాసెస్ ప్రారంభమవుతుంది

కార్ ఇన్సూరెన్స్ ఒటిఎస్ క్లెయిములు

ఆన్-ది-స్పాట్ ఫీచర్‌నే ఒటిఎస్ అని పిలుస్తారు. మీరు అదే ప్రదేశం నుండి తక్షణం క్లెయిములు చేయడానికి ఇది మిమ్మల్ని అనుమతిస్తుంది. ఒటిఎస్ ఫీచర్‌తో, ఒకరు రూ. 30,000* వరకు క్లెయిమ్‌లు చేయవచ్చు మరియు 20* నిమిషాలు లేదా తక్కువ సమయంలోనే ఆ మొత్తం అందుకుంటారు.

మోటార్ ఒటిఎస్ క్లెయిమ్ ప్రయోజనం పొందడానికి:

✓ డౌన్‌లోడ్ చేసుకోండి కేరింగ్లీ యువర్స్ మొబైల్ యాప్ మరియు అవసరమైన అన్ని వివరాలతో సైన్ ఇన్ చేయండి

✓ దెబ్బతిన్న కార్ ఫోటోలు క్లిక్ చేయండి మరియు యాప్‌లో వాటిని అప్‌లోడ్ చేయండి

✓ ఫోటోలు ధృవీకరించబడతాయి, ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత, ఆ మొత్తం బ్యాంక్ అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ చేయబడుతుంది

*ప్రామాణిక నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి                                                                                                

సమగ్ర కార్ ఇన్సూరెన్స్‌లో ఏవి కవర్ చేయబడతాయి మరియు ఏవి కవర్ చేయబడవు?

  • చేర్పులు

  • మినహాయింపులు

ప్రకృతి వైపరీత్యం కారణంగా జరిగే నష్టం

ఒక సమగ్ర వెహికల్ ఇన్సూరెన్స్ ప్లాన్ అనేది అగ్నిప్రమాదం, భూకంపం, టైఫూన్, వరద, తుఫాను మొదలైన ప్రకృతి వైపరీత్యాల నుండి కారుకు కవర్ అందిస్తుంది.

మానవ జోక్యంతో జరిగే విపత్తు కారణంగా జరిగిన నష్టం

అల్లర్లు, సమ్మెలు లేదా ఏదైనా హానికర చర్య లాంటి మానవ జోక్యంతో జరిగే విపత్తుల నుండి కూడా ఇన్సూర్ చేయబడిన కారుకు ఈ ప్లాన్ కవర్ అందిస్తుంది. బాహ్య మార్గాలు లేదా తీవ్రవాద కార్యకలాపాల కారణంగా ఏదైనా ప్రమాదం నుండి రక్షణను కూడా ఇది కలిగి ఉంటుంది. 

పర్సనల్ యాక్సిడెంట్ కవర్

ఇన్సూర్ చేయబడిన కారు యజమాని-డ్రైవర్‌కు రూ. 15 లక్షల వరకు మొత్తం పర్సనల్ యాక్సిడెంట్ కవర్ అందించబడుతుంది. అంతేకాకుండా, పెయిడ్ డ్రైవర్ మరియు ప్రయాణీకుల కోసం పర్సనల్ యాక్సిడెంట్ కవర్‌కి కూడా యాక్సెస్ ఉంటుంది. 

థర్డ్ పార్టీల చట్టపరమైన బాధ్యతలు

ఒకవేళ థర్డ్ పార్టీకి ఏదైనా నష్టం జరిగితే, సమగ్ర కార్ ఇన్సూరెన్స్ అనేది ఆ కవరేజ్ బాధ్యతలను చూసుకుంటుంది. ఇది థర్డ్ పార్టీ ఆస్తికి నష్టం లేదా థర్డ్ పార్టీ జీవితానికి నష్టం కావచ్చు.

1 ఆఫ్ 1

ఇన్‌యాక్టివ్ కార్ ఇన్సూరెన్స్ పాలసీ

పాలసీ నిష్క్రియంగా ఉన్నప్పుడు లేదా లాప్స్ చేయబడినప్పుడు కారుకు జరిగిన ఏదైనా డ్యామేజీ లేదా నష్టం. సమగ్ర మోటార్ ఇన్సూరెన్స్ పాలసీని సకాలంలో రెన్యూవల్‌ చేశారని నిర్ధారించుకోండి.

చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవింగ్

చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ లేని డ్రైవర్ ద్వారా, ఇన్సూర్ చేయబడిన వాహనం నడిపినట్లయితే, ఎలాంటి క్లెయిమ్‌లు అంగీకరించబడవు.

డ్రంక్ డ్రైవింగ్

ఒకవేళ క్లెయిమ్ చేయబడితే, యజమాని-డ్రైవర్ తాగి ఉన్నట్లు గుర్తించబడితే లేదా ఏదైనా ఇతర మత్తు/పదార్థాల దుర్వినియోగ ప్రభావంలో ఉన్నట్లు గుర్తించబడితే.

నిర్లక్ష్యం

సరళంగా చెప్పాలంటే, లాజికల్‌గా మీరు చేయకూడని పనులు చేయకండి. ఉదాహరణకు, మీరు నివసించే నగరంలో వరదల పరిస్థితి ఉన్నప్పుడు, కారు బయటకు తీసుకువెళ్ళే ప్రమాదం కాబట్టి, ఆ పని చేయకండి. అలాంటి నిర్లక్ష్యం నివారించబడాలి లేదా ఆ ప్లాన్ వాటికి కవర్ అందించదు. ఇది ఇన్సూరర్ నుండి ఇన్సూరర్‌కి మారవచ్చు. 

తిరుగుబాటు, యుద్ధం, లేదా న్యూక్లియర్ ప్రమాదం

యుద్ధం లాంటి పరిస్థితి, అణు ప్రమాదం లేదా విద్రోహం సమయంలో కారుకి జరిగే ఏదైనా నష్టం కూడా కవర్ చేయబడదు. 

అరుగుదల మరియు తరుగుదల

సాధారణ అరుగుదల మరియు తరుగుదల లేదా కారు సాధారణ వయస్సు కారణంగా సంభవించే ఏదైనా నష్టం కవర్ చేయబడదు. లేదా కారు తయారీదారు మార్గదర్శకాలకు మించిన ఏదైనా నష్టం కోసం.

1 ఆఫ్ 1

డిస్‌క్లెయిమర్: ఇది ఒక సమగ్ర జాబితా కాదు. మరింత సమాచారం కోసం, దయచేసి పాలసీ నిబంధనలను జాగ్రత్తగా చదవండి. 

 

సమగ్ర కార్ ఇన్సూరెన్స్‌ను ఎవరు కొనుగోలు చేయాలి?


ఇప్పటి వరకు, మీకు సమగ్ర ఇన్సూరెన్స్ ప్లాన్ గురించి బాగానే తెలిసింది. సమగ్ర కార్ ఇన్సూరెన్స్ పాలసీని ఎవరు కొనుగోలు చేయాలి అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా?

క్రింది కేటగిరీల్లోకి వచ్చే ఎవరైనా సరే, తెలివైన నిర్ణయం తీసుకోవాలి:

మీరు కొత్త యజమాని అయితే

కారును కొనుగోలు చేయడం అంత సులభమైన పనేమీ కాదు. ఇందులో చాలా ప్లానింగ్ మరియు డబ్బు ఖర్చు ఉంటుంది. మీరు ఒక కారును కొనుగోలు చేసే సమయంలో, సమగ్ర ఇన్సూరెన్స్ కవరేజీ తీసుకోండి.

టైర్-I మరియు టైర్-II నగరంలో నివసిస్తుంటే

నగరంలో డ్రైవింగ్ సులభంగానే అనిపించవచ్చు కానీ, అది నిజం కాదు. సురక్షితంగా డ్రైవ్ చేయడానికి మరియు మిమ్మల్ని మరియు కారుని బాధ్యతాయుతంగా రక్షించుకోవడానికి తగిన సమగ్ర ఫోర్-వీలర్ ఇన్సూరెన్స్ పాలసీ కొనుగోలు చేయండి.

ఒక కొత్త డ్రైవర్

మీరు ఇటీవలే డ్రైవింగ్ ప్రారంభించినట్లయితే, ఒక సమగ్ర ఇన్సూరెన్స్ పాలసీ కలిగి ఉండండి. ఏదైనా జరిగిన తర్వాత బాధపడడం కంటే, ముందే సురక్షితంగా ఉండటం మంచిది మరియు సరైన ఇన్సూరెన్స్ కవరేజ్ కలిగి ఉండడమనేది ప్రతి పరిస్థితిలోనూ మీకు సహాయపడుతుంది. 

తరచుగా డ్రైవింగ్ చేసేవారు/ ప్రయాణించేవారు

మీరు క్రమం తప్పకుండా డ్రైవ్ చేసేవారైతే, రక్షణ సర్కిల్‌లో మిమ్మల్ని మీరు చేర్చుకోవడం కోసం తగిన వెహికల్ ఇన్సూరెన్స్ పాలసీ ఎంచుకోండి

 

మీరు ఒక సమగ్ర కార్ ఇన్సూరెన్స్‌ను ఎందుకు కొనుగోలు చేయాలి?

థర్డ్-పార్టీ ఇన్సూరెన్స్‌ అనేది ఒక చట్టపరమైన అవసరం కాబట్టి, ప్రజలు తరచుగా దాని కొనుగోలుని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. అయితే, ప్రమాదం జరిగిన సందర్భంలో మరమ్మత్తు లేదా మార్పిడి ఖర్చును థర్డ్-పార్టీ లయబిలిటీ కవర్ కవర్ చేయదు కాబట్టి, ఒక సమగ్ర మోటార్ వెహికల్ ఇన్సూరెన్స్ పాలసీ ఎంచుకోవడం కూడా అంతే ముఖ్యం.

బజాజ్ అలియంజ్ కార్ ఇన్సూరెన్స్ పాలసీని ఎంచుకోవడానికి కొన్ని కీలక కారణాలు క్రింద ఇవ్వబడ్డాయి:

ఫీచర్లు

కార్ ఇన్సూరెన్స్ ప్రయోజనం

నగదురహిత సర్వీసులు

7200+ నెట్‌వర్క్ గ్యారేజీలలో

నగదురహిత ఆసుపత్రిలో చేరిక

8600+ నెట్‌వర్క్ ఆసుపత్రులలో

నో క్లెయిమ్ బోనస్ ట్రాన్స్‌ఫర్

50% వరకు

క్లెయిమ్ సెటిల్‌మెంట్ నిష్పత్తి

98%*

క్లెయిమ్ ప్రాసెస్

20 నిమిషాల్లో డిజిటల్*

మోటార్ ఆన్-ది-స్పాట్ (ఎంఒటిఎస్)

కేరింగ్లీ యువర్స్ మొబైల్ యాప్ ద్వారా

*ప్రామాణిక నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి

సమగ్ర కార్ ఇన్సూరెన్స్‌లో ఏ యాడ్-ఆన్‌లు ఉంటాయి?

బేస్ ప్లాన్‌లో చేర్చబడిన యాడ్-ఆన్‌లు కలిగి ఉండడమనేది సమగ్ర ప్లాన్‌ను మరింత దృఢమైనదిగా చేస్తుంది. పాలసీకి విలువ జోడించే సమగ్ర ఇన్సూరెన్స్ ప్లాన్‌లో యాడ్-ఆన్‌లు ఎంచుకోవలసిందిగా మేము మీకు సూచిస్తున్నాము. మేము అందించే ఉత్తమ యాడ్-ఆన్‌ల వివరాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి:
Engine Protector

ఇంజిన్ ప్రొటెక్టర్

ఇంజిన్ అనేది కారులో అత్యంత ముఖ్యమైన మరియు ఖరీదైన భాగం. మరింత చదవండి

ఇంజిన్ ప్రొటెక్టర్

ఇంజిన్ అనేది కారులో అత్యంత ముఖ్యమైన మరియు ఖరీదైన భాగం. స్టాండర్డ్ కార్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది ఇంజిన్‌కు జరిగిన నష్టాలను కవర్ చేయకపోవచ్చు. ప్రమాదం జరిగిన సందర్భంలో, ఇంజిన్‌ను మరమ్మత్తు చేయడం ఖరీదైన వ్యవహారం కావచ్చు. ఇంజిన్ ప్రొటెక్టర్ యాడ్-ఆన్ కలిగి ఉండడమనేది ఆయిల్ లీకేజ్, నీళ్లు లోపలకి వెళ్లడం మొదలైన వాటి కారణంగా అయ్యే ఖర్చులను కవర్ చేస్తుంది.

Zero Depreciation

సున్నా తరుగుదల

దీనిని బంపర్-టూ-బంపర్ కవర్ అని కూడా పిలుస్తారు. మరింత చదవండి

దీనిని బంపర్-టూ-బంపర్ కవర్ అని కూడా పిలుస్తారు. ఒక జీరో డిప్రిసియేషన్ యాడ్-ఆన్ అనేది కారుకు సంబంధించిన డిప్రిసియేషన్‌ను రద్దు చేయడంలో సహాయపడుతుంది. అంటే, వాహనం తరుగుదలను ఇన్సూరర్ పరిగణనలోకి తీసుకోరు కాబట్టి, కారు మార్కెట్ విలువను కోల్పోదు. కారు వయసు 5 సంవత్సరాల కంటే తక్కువగా ఉంటే, ఈ యాడ్-ఆన్ కవర్ చేర్చాలి*.

*ప్రామాణిక నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి

Key And Lock Replacement

కీ మరియు లాక్ రీప్లేస్‌మెంట్

తాళం పోయినా లేదా ఎక్కడైనా పెట్టి మర్చిపోయినా అయ్యే ఖర్చులు తగ్గించడానికి ఈ యాడ్-ఆన్ వీలు కల్పిస్తుంది. మరింత చదవండి

కీ మరియు లాక్ రీప్లేస్‌మెంట్

తాళం చెవులు పోగొట్టుకున్నా లేదా ఎక్కడైనా పెట్టి మర్చిపోయినా అయ్యే ఖర్చులు తగ్గడానికి ఈ యాడ్-ఆన్ వీలు కల్పిస్తుంది. కారు లాక్ మరియు తాళం పూర్తి స్థాయిలో కొనుగోలు చేయడం మరియు మార్చడానికి అయ్యే ఖర్చును ఇన్సూరర్ భరిస్తారు

24/7 Spot Assistance

24/7 స్పాట్ సహాయం

కార్ ఇన్సూరెన్స్ పాలసీలో చేర్చాల్సిన అత్యంత ఉపయోగకర యాడ్-ఆన్‌లలో ఇది ఒకటి. మరింత చదవండి

24/7 స్పాట్ సహాయం

కార్ ఇన్సూరెన్స్ పాలసీలో చేర్చాల్సిన అత్యంత ఉపయోగకర యాడ్-ఆన్‌లలో ఇది ఒకటి. ఈ యాడ్-ఆన్‌ కలిగి ఉండడమనేది మీరు రోడ్డు మీద ఎప్పుడూ చిక్కుకుపోరని నిర్ధారిస్తుంది. ఇన్సూర్ చేయబడిన కారుకు సంబంధించిన ఏదైనా ప్రతికూలత తలెత్తినప్పుడు, మీకు సహాయం చేయడానికి ఈ బృందం ఒక కాల్ దూరంలోనే ఉంటుంది.

Personal Baggage

పర్సనల్ బ్యాగేజ్

ఈ యాడ్-ఆన్ కలిగి ఉండడమనేది వ్యక్తిగత వస్తువులను సురక్షితం చేస్తుంది మరియు కవర్ కూడా అందిస్తుంది మరింత చదవండి

పర్సనల్ బ్యాగేజ్

ఈ యాడ్-ఆన్‌ను కలిగి ఉండడమనేది వ్యక్తిగత వస్తువులను సురక్షితం చేస్తుంది మరియు ఇన్సూర్ చేయబడిన కారు నుండి ఏదైనా నష్టం లేదా దొంగతనం/దోపిడీ కారణంగా జరిగిన నష్టానికి కూడా కవర్ అందిస్తుంది.

Consumable Expenses

కన్జ్యూమబుల్ ఖర్చులు

ఈ యాడ్-ఆన్, కూలెంట్ లాంటి కన్జ్యూమబుల్‌ సంబంధిత ఖర్చులు అందిస్తుంది మరింత చదవండి

ఈ యాడ్-ఆన్ అనేది కూలెంట్, ఇంజిన్/బ్రేకింగ్ ఆయిల్, గేర్‌బాక్స్ ఆయిల్ మొదలైన వాటితో సహా కన్జ్యూమబుల్ సంబంధిత ఖర్చులను సర్వీసింగ్ లేదా యాక్సిడెంట్ సమయంలో కవర్ చేస్తుంది.

Conveyance Benefit

కన్వేయన్స్ ప్రయోజనం

కారు గ్యారేజీలో మరమ్మత్తు చేయబడినప్పుడు మరియు క్లెయిమ్‌ను ఇన్సూరర్ అంగీకరించిన తర్వాత, మరింత చదవండి

కన్వేయన్స్ ప్రయోజనం

కారు గ్యారేజీలో రిపేర్ చేయబడినప్పుడు మరియు క్లెయిమ్‌ను ఇన్సూరర్ అంగీకరించిన తర్వాత, మీ రోజువారీ ప్రయాణం కోసం చెల్లించబడుతుందని ఈ యాడ్-ఆన్ నిర్ధారిస్తుంది.

డిస్‌క్లెయిమర్: మరిన్ని వివరాల కోసం, దయచేసి పాలసీ వివరాలను జాగ్రత్తగా చూడండి.

సమగ్ర కార్ ఇన్సూరెన్స్ గురించి తరచుగా అడగబడే ప్రశ్నలు

జీరో డిప్రిసియేషన్ కార్ ఇన్సూరెన్స్‌తో పోలిస్తే, సమగ్ర కార్ ఇన్సూరెన్స్ అనేది భిన్నంగా ఉంటుందా?

ఇవి రెండూ పూర్తిగా రెండు విభిన్న అంశాలు. ఒక సమగ్ర ప్లాన్ అనేది ఒక రకమైన కార్ ఇన్సూరెన్స్ పాలసీ. అయితే, జీరో డిప్రిసియేషన్ అనేది ఒక యాడ్-ఆన్ కవర్. ఇప్పటికే ఉన్న కార్ ఇన్సూరెన్స్ పాలసీలో యాడ్-ఆన్ కవర్ ఒక భాగంగా చేరడం ద్వారా, దానిని మరింత సమగ్రంగా చేస్తుంది.

పాత కారు కోసం సమగ్ర కార్ ఇన్సూరెన్స్ ఒక మంచి ఆలోచనగా ఉంటుందా?

కారు ఎంత పాతది, దాని వినియోగం మరియు దానిని ఎంత కాలం ఉపయోగించవచ్చు అనే వాటి మీద ఆధారపడి ఉంటుంది. కారు వయసు 15 సంవత్సరాల కంటే తక్కువ ఉన్నట్లయితే, క్రమం తప్పకుండా ఒక సమగ్ర ప్లాన్‌లో పెట్టుబడి పెట్టడాన్ని పరిగణనలోకి తీసుకోండి. సమగ్ర ప్లాన్‌ ఎంచుకోవడమనేది గరిష్ట భద్రత కోసం ఒక మెరుగైన ఆలోచన కాగలదు.

సమగ్ర కార్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయడానికి ఉత్తమ సమయం ఏమిటి?

మీరు కారుకి యజమాని అయిన రోజు నుండే, మీకు కారు ఇన్సూరెన్స్ పాలసీ ఉండాలి. ఒకవేళ మీకు థర్డ్-పార్టీ లయబిలిటీ కవర్ మాత్రమే ఉంటే, భారతీయ రోడ్ల మీద నడపడానికి ముందు ఆర్థిక భద్రతను నిర్ధారించే సమగ్ర కవర్‌ను ఎంచుకోండి.

సమగ్ర కార్ ఇన్సూరెన్స్ ఖరీదైనదిగా ఉంటుందా?

థర్డ్-పార్టీ ఇన్సూరెన్స్‌తో పోలిస్తే, సమగ్ర వెహికల్ ఇన్సూరెన్స్ అనేది మరింత ఖరీదైనదిగా ఉంటుంది. అయితే, అది అందించే ప్రయోజనాలతో పోల్చినప్పుడు, డబ్బు అనేది రెండవ అంశంగా ఉంటుంది. 

సమగ్ర కార్ ఇన్సూరెన్స్‌ను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయడం సాధ్యమేనా?

అవును, మీ అవసరాల మేరకు మీకు తగిన బజాజ్ అలియంజ్ కార్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను ఆన్‌లైన్‌లో ఎంచుకోవచ్చు. 

సమగ్ర కార్ ఇన్సూరెన్స్‌ను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయడం సురక్షితమేనా?

గరిష్ట భద్రతను నిర్ధారించడానికి, ఇన్సూరెన్స్ కంపెనీ వెబ్‌సైట్ నుండి నేరుగా ఆన్‌లైన్‌లో కార్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను కొనుగోలు చేయడాన్ని మీరు పరిగణనలోకి తీసుకోవచ్చు.

నేను నా సమగ్ర ఇన్సూరెన్స్ ప్రీమియంలను లెక్కించవచ్చా?

సమగ్ర వెహికల్ ఇన్సూరెన్స్ ప్రీమియంను లెక్కించడానికి ఇన్సూరెన్స్ ప్రీమియం క్యాలిక్యులేటర్‌ను మీరు ఆన్‌లైన్‌లో ఉపయోగించవచ్చు. 

సమగ్ర ఇన్సూరెన్స్ మరియు థర్డ్-పార్టీ కార్ ఇన్సూరెన్స్ మధ్య తేడా ఏమిటి?

ఒక సమగ్ర పాలసీ అనేది వాహనం మరియు మీకు అనేక రక్షణ కవర్లు అందిస్తుంది. దీనికి విరుద్ధంగా, థర్డ్-పార్టీ లయబిలిటీ కవర్ అనేది థర్డ్-పార్టీ క్లెయిమ్ నుండి రక్షణకు మాత్రమే పరిమితం చేయబడింది.

*ప్రామాణిక నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి

డిస్‌క్లెయిమర్

వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్‌. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.

దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి

  • ఎంచుకోండి
    దయచేసి ఎంచుకోండి
  • దయచేసి మీ కామెంట్‌ను వ్రాయండి

మమ్మల్ని సంప్రదించడం చాలా సులభం