రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్‌: 9152007550 (మిస్డ్ కాల్)

సేల్స్: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 సర్వీస్ చాట్: +91 75072 45858

ఇంగ్లాండ్

Claim Assistance
Get In Touch
3 Two Wheeler Insurance Add-Ons That Provide More Value
జూలై 23, 2020

మీరు ఏ టూ వీలర్ ఇన్సూరెన్స్ యాడ్-ఆన్‌లను ఎంచుకోవాలి?

తమ బైక్‌లను రోజువారి ప్రయాణం కోసం వినియోగించే వ్యక్తులకు టూ వీలర్ ఇన్సూరెన్స్ పాలసీ తప్పనిసరి. పర్సనల్ యాక్సిడెంట్ (యజమాని/ డ్రైవర్ మరణం లేదా శాశ్వత పూర్తి వైకల్యం), నష్టం, డ్యామేజ్, మీ వాహన దొంగతనం లాంటి సందర్భాల్లో ఈ పాలసీ మిమ్మల్ని ఇన్సూర్ చేస్తుంది, అలాగే, థర్డ్ పార్టీ బాధ్యత కోసం కూడా మిమ్మల్ని కవర్ చేస్తుంది. కానీ, పాలసీ అదనపు కవర్లతో ఎక్కువ ప్రయోజనాలను అందిస్తుంది.

ఒక స్టాండర్డ్ టూ వీలర్ పాలసీని 1 సంవత్సరం వరకు కొనుగోలు చేయవచ్చు, అయితే దీర్ఘకాలిక టూ వీలర్ ఇన్సూరెన్స్ పాలసీని 3 సంవత్సరాల వరకు పొందవచ్చు. మీరు మీ టూ వీలర్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేసినప్పుడు లేదా రెన్యూ చేసినప్పుడు అదనపు కవర్లను పొందవచ్చు, కానీ పాలసీ వ్యవధిలో కాదు. ఈ పొడిగింపులు మీ బైక్ కోసం గరిష్ట కవరేజీని అందిస్తాయి.

మీరు మీ టూ వీలర్ కోసం పొందవలసిన కొన్ని సాధారణ అదనపు కవర్లు దిగువ ఇవ్వబడ్డాయి మరియు ఇవి మీ టూ వీలర్ ఇన్సూరెన్స్‌కు మరింత విలువను జోడించగలవు.

1. జీరో లేదా నిల్ డిప్రిషియేషన్ కవర్

డిప్రిసియేషన్ అనేది సమయం గడిచే కొద్దీ అరుగుదల మరియు తరుగుదల కారణంగా ఆస్తుల ధరలో తగ్గుదలను సూచిస్తుంది. ఒక జీరో డిప్రిషియేషన్ కవర్ అనేది మీకు జరిగిన నష్టం, డ్యామేజ్ మరియు దొంగతనం కోసం పూర్తి క్లెయిమ్‌తో పాటు డిప్రిషియేషన్ విలువను కవర్ చేయడం ద్వారా మీ ప్రస్తుత పాలసీకి మరింత రక్షణను జోడిస్తుంది. ఇది మీ బైక్‌లోని ప్లాస్టిక్, రబ్బర్ మరియు ఫైబర్ లాంటి విడిభాగాల మరమ్మత్తు లేదా రీప్లేస్‌మెంట్ ఖర్చును కూడా కవర్ చేస్తుంది.

2. పిలియన్ రైడర్‌ల కోసం పర్సనల్ యాక్సిడెంట్ కవర్

ఒక స్టాండర్డ్ బైక్ ఇన్సూరెన్స్ పాలసీ డ్రైవింగ్ సమయంలో వాహన యజమాని/ డ్రైవర్‌ను కవర్ చేస్తుంది. కానీ, మీ బైక్‌ యాక్సిడెంట్ తీవ్రంగా ఉండవచ్చు మరియు మీ తోటి-ప్రయాణికులకు అతని/ ఆమెకు స్వల్ప లేదా తీవ్రమైన గాయాలు కావచ్చు. ఈ యాడ్-ఆన్ కవర్ మీ పిలియన్ రైడర్ నష్టాన్ని కవర్ చేయగలదు. మీ కొత్త బైక్ ఇన్సూరెన్స్ పాలసీతో ఈ కవర్‌ను ఎంచుకోవడం వలన మీ బైక్‌పై ప్రయాణిస్తున్నప్పుడు గాయపడిన వారికి ప్రయోజనకరంగా ఉంటుంది.

3. యాక్సెసరీలకు నష్టం

ఈ రోజుల్లో ప్రజలు వారి బైక్‌లను బ్లూటూత్ పరికరాలు, గ్రిల్స్ సెట్, ఫ్యాన్సీ లైట్లు, సీట్ కిట్ లాంటి అనేక యాక్సెసరీలతో అలంకరిస్తారు మరియు మీరు వారిలో ఒకరు కావచ్చు. ఈ అలంకారాలు ఒక ప్రమాదంలో పాడైపోవచ్చు లేదా దెబ్బతినవచ్చు. ఈ యాడ్-ఆన్ కవర్ మీ బైక్ నష్టపోయిన ఎలక్ట్రిక్ మరియు నాన్-ఎలక్ట్రిక్ యాక్సెసరీల కోసం మీకు రీయంబర్స్ చేయగలదు.

టూ వీలర్ ఇన్సూరెన్స్ పాలసీలో పైన పేర్కొన్న పొడిగింపులు ఉన్నాయి, వాటిని పొందినప్పుడు ప్రమాదం జరిగిన సందర్భంలో మీకు అత్యంత ప్రయోజనం చేకూరుతుంది.‌ టూ వీలర్ ఇన్సూరెన్స్ కోట్‌లు అంచనా వేయండి మరియు మీ బడ్జెట్, మీ అవసరాలకు అనుగుణంగా పాలసీని కస్టమైజ్ చేసుకోండి.

ఈ ఆర్టికల్ ఉపయోగకరంగా ఉందా? రేటింగ్ ఇవ్వండి

సగటు రేటింగ్ 5 / 5. ఓట్ల లెక్కింపు: 18

ఇప్పటివరకు ఏ ఓట్లు లేవు! ఈ పోస్ట్‌కు రేటింగ్ ఇచ్చే మొదటి వ్యక్తి అవ్వండి.

ఈ ఆర్టికల్ మీకు నచ్చిందా?? మీ స్నేహితులతో షేర్ చేయండి!

మీ ఆలోచనలను షేర్ చేయండి. దిగువన మీ అభిప్రాయం తెలపండి!

రిప్లై ఇవ్వండి

మీ ఇమెయిల్ అడ్రస్ ప్రచురించబడదు. దయచేసి అన్ని వివరాలను పూరించండి