రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్‌: 9152007550 (మిస్డ్ కాల్)

సేల్స్: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 సర్వీస్ చాట్: +91 75072 45858

ఇంగ్లాండ్

Claim Assistance
Get In Touch
Comprehensive Vehicle Insurance
ఫిబ్రవరి 24, 2023

సమగ్ర వెహికల్ ఇన్సూరెన్స్ ద్వారా హిట్-అండ్-రన్‌లు కవర్ చేయబడతాయా?

కారు ప్రమాదాలనేవి ఒక భయానక మరియు పీడకల లాంటి అనుభవం కావచ్చు. ప్రత్యేకించి, ఎదుటి డ్రైవర్ తన గురించి ఎలాంటి ఆధారం దొరక్కుండా పారిపోతే, పరిస్థితి తీవ్రంగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో, మీ సమగ్ర వెహికల్ ఇన్సూరెన్స్ అనేది హిట్-అండ్-రన్ సంఘటనను కవర్ చేస్తుందా, లేదా అని మీకు అనుమానం రావచ్చు. చాలావరకు, సమగ్ర వెహికల్ ఇన్సూరెన్స్ అనేది దొంగతనం, ప్రకృతి వైపరీత్యాలు, మానవ జోక్యంతో జరిగే విపత్తులు మరియు మరిన్నింటితో సహా, విస్తృత శ్రేణి సంఘటనలను కవర్ చేస్తుంది. * అయితే, హిట్-అండ్-రన్ కేసుల మాటేమిటి? ఈ కథనంలో, మనం ఈ వివరాలు తెలుసుకుందాం-‌ సమగ్ర ఇన్సూరెన్స్ కవరేజీ మరియు హిట్-అండ్-రన్స్ కవర్ చేయబడతాయా.

సమగ్ర ఇన్సూరెన్స్ అనేది హిట్-అండ్-రన్స్‌ను కవర్ చేస్తుందా?

చాలా సందర్భాల్లో, హిట్-అండ్-రన్ సంఘటనలనేవి సమగ్ర ఇన్సూరెన్స్ ద్వారా కవర్ చేయబడుతాయి. హిట్-అండ్-రన్ డ్రైవర్ కారణంగా జరిగిన నష్టాలు కవర్ చేసుకోవడం కోసం, మీరు మీ ఇన్సూరెన్స్ కంపెనీకి క్లెయిమ్ ఫైల్ చేయవచ్చు. అయితే, ఈ కవరేజీ విషయంలో కొన్ని పరిమితులు ఉండవచ్చని గమనించడం ముఖ్యం. * చాలావరకు ఇన్సూరెన్స్ సంస్థల నిబంధనల ప్రకారం, హిట్-అండ్-రన్ జరిగిన తర్వాత, నిర్దిష్ట కాలపరిమితి లోపల పోలీస్ రిపోర్ట్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. అలా చేయడంలో మీరు విఫలమైతే, మీ ఇన్సూరెన్స్ కంపెనీ మీ క్లెయిమ్‌ను తిరస్కరించవచ్చు. అంతేకాకుండా, మీ నష్టాలను మీ ఇన్సూరెన్స్ కంపెనీ కవర్ చేసే ముందు మీరు చెల్లించాల్సిన మినహాయింపు కూడా అందులో ఉండవచ్చు. మీ పాలసీ ఆధారంగా, మినహాయించదగిన మొత్తం మారవచ్చు. పాలసీ మరియు ఇన్సూరెన్స్ కంపెనీ ప్రకారం సమగ్ర ఇన్సూరెన్స్ కవరేజీ మారుతుంది అని గమనించడం ముఖ్యం. డ్రైవర్ గుర్తించబడి, తప్పు అంగీకరించిన పరిస్థితుల్లో మాత్రమే కొన్ని పాలసీలు హిట్-అండ్-రన్ ప్రమాదాలను కవర్ చేయవచ్చు. ఇతర పాలసీల విషయంలో, డ్రైవర్‌ను గుర్తించారా, లేదా అనే దానితో సంబంధం లేకుండానే హిట్-అండ్-రన్స్‌ను కవర్ చేయవచ్చు. మీ పాలసీని జాగ్రత్తగా చదవడం మరియు అందులో ఏవి కవర్ చేయబడుతున్నాయో పూర్తిగా అర్థం చేసుకోవడం కోసం మీ ఇన్సూరెన్స్ ఏజెంట్‌తో మాట్లాడడం చాలా ముఖ్యం.

హిట్-అండ్-రన్ సంఘటనలు ఎదురైనప్పుడు ఏం చేయాలి?

మీరు ఒక హిట్-అండ్-రన్ సంఘటనలో భాగం అయినప్పుడు, తప్పనిసరిగా కింది దశలను అనుసరించి మీ వెహికల్ ఇన్సూరెన్స్ సంస్థ వద్ద విజయవంతంగా క్లెయిమ్ చేసుకోవచ్చు:
 • పోలీసులకు కాల్ చేయండి:

  వీలైనంత త్వరగా పోలీసులను సంప్రదించండి మరియు ఎఫ్ఐఆర్ అనే మొదటి సమాచార నివేదికను ఫైల్ చేయండి. మీ ఇన్సూరెన్స్ కంపెనీకి క్లెయిమ్ ఫైల్ చేసేటప్పుడు ఎఫ్‌ఐఆర్ ముఖ్యం.
 • సమాచారం సేకరించండి:

  హిట్ అండ్ రన్‌కి పాల్పడిన డ్రైవర్ మరియు వారి వాహనం గురించి సాధ్యమైనంత ఎక్కువ సమాచారం సేకరించే ప్రయత్నం చేయండి. లైసెన్స్ ప్లేట్ నంబర్, వాహనం తయారీ మరియు మోడల్ మరియు ఏవైనా గుర్తింపు ఫీచర్లు లాంటివి ఈ సమాచారంలో భాగం కాగలవు. అయితే, ఈ సమాచార సేకరణ ప్రయత్నంలో మీరు ప్రమాదంలోకి వెళ్లకుండా జాగ్రత్త పడండి.
 • సన్నివేశాన్ని డాక్యుమెంట్ చేయండి:

  మీ కారుకు మరియు చుట్టూ పరిసరాలకి జరిగిన నష్టాన్ని ఫోటోలు తీయండి మరియు సంఘటన జరిగిన సమయం, తేదీ మరియు లొకేషన్ గురించి నిర్థారించుకోండి.
 • మీ ఇన్సూరెన్స్ కంపెనీని సంప్రదించండి:

  సంఘటన గురించి నివేదించడానికి వీలైనంత త్వరగా మీ ఇన్సూరెన్స్ కంపెనీని సంప్రదించండి మరియు ఎఫ్ఐఆర్ మరియు ఏదైనా ఇతర సంబంధిత సమాచారాన్ని వారికి అందించండి.

హిట్-అండ్-రన్ సంఘటన కోసం ఏవిధంగా క్లెయిమ్‌ను ఫైల్ చేయాలి?

దీని కింద హిట్ అండ్ రన్ క్లెయిమ్ ఫైల్ చేయడానికి దశలు ఇవ్వబడ్డాయి - సమగ్ర వెహికల్ ఇన్సూరెన్స్:
 1. మీ ఇన్సూరర్‌కు తెలియజేయండి

  పైన పేర్కొన్న విధంగా, ప్రమాదం తర్వాత క్లెయిమ్‌ను నివేదించడం కోసం వీలైనంత త్వరగా మీ ఇన్సూరెన్స్ కంపెనీని సంప్రదించండి. క్లెయిమ్ ప్రాసెస్ గురించి మీ ఇన్సూరర్ మీకు మార్గనిర్దేశం చేస్తారు మరియు మీ కవరేజీ గురించి మీకు సమాచారం అందిస్తారు.
 1. అవసరమైన సమాచారం అందించండి

  ఎఫ్ఐఆర్, మీ కారు తయారీ మరియు మోడల్, ఏర్పడిన డ్యామేజీలు మరియు మీకు తగిలిన ఏవైనా గాయాలతో సహా, ప్రమాదం గురించిన సమాచారం కోసం ఇన్సూరర్ మిమ్మల్ని అడుగుతారు.
 1. సర్వేయర్ కోసం వేచి ఉండండి

  మీరు సమాచారం అందించిన తర్వాత, మీ కారుకు సంబంధించిన నష్టాలు అంచనా వేయడం కోసం ఒక సర్వేయర్‌ను ఇన్సూరర్ పంపుతారు. మీ కారుకు జరిగిన నష్టం మరియు మరమ్మత్తుల ఖర్చు గురించి సర్వేయర్ ఒక నివేదికను సిద్ధం చేస్తారు.
 1. అవసరమైన డాక్యుమెంట్లు సమర్పించండి

  మీరిప్పుడు పోలీస్ రిపోర్ట్, సర్వేయర్ రిపోర్ట్ మరియు ఇన్సూరర్ ద్వారా అభ్యర్థించబడిన ఏదైనా ఇతర డాక్యుమెంటేషన్‌తో సహా, అవసరమైన అన్ని డాక్యుమెంట్లను ఇన్సూరెన్స్ కంపెనీకి సమర్పించాలి.
 1. మరమ్మత్తు కోసం మీ కారును పంపండి

  నగదురహిత మరమ్మత్తుల కోసం మీ కారు నెట్‌వర్క్ గ్యారేజీకి పంపబడుతుంది. మీరు మీకు నచ్చిన గ్యారేజీని కూడా ఎంచుకోవచ్చు. అయితే, ముందుగా మీరు స్వయంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. *
 1. మీ ఇన్సూరర్‌తో ఫాలో అప్ చేయండి

  మీ క్లెయిమ్ స్థితి మరియు మీ కారు మరమ్మత్తుల పురోగతి గురించి అప్‌డేట్లు పొందడానికి మీ ఇన్సూరర్‌ను సంప్రదించండి.
ఈ దశలు అనుసరించడం ద్వారా, మీ హిట్ అండ్ రన్‌ను ఈ సమగ్ర కారు ఇన్సూరెన్స్  సజావుగా నిర్వహిస్తుందని మీరు నిర్ధారించుకోవచ్చు మరియు మీ కారుకు జరిగిన నష్టాల కోసం మీకు అవసరమైన పరిహారం పొందవచ్చు.

ముగింపు

వివిధ కారణాలతో మీ కారుకి జరిగే నష్టాల నుండి మిమ్మల్ని రక్షించడానికి సమగ్ర ఇన్సూరెన్స్ కవరేజీ రూపొందించబడింది మరియు హిట్-అండ్-రన్ సంఘటనలనేవి సాధారణంగా ఈ రకమైన ఇన్సూరెన్స్ ద్వారా కవర్ చేయబడుతాయి. అయితే, మీ పాలసీ ద్వారా అందించబడిన నిర్దిష్ట కవరేజీ అనేది మీ పాలసీ వివరాల ఆధారంగా మారవచ్చు. మీకు హిట్-అండ్-రన్ సంఘటన ఎదురైనప్పుడు, మీరు మీ ఇన్సూరెన్స్ కంపెనీకి విజయవంతంగా క్లెయిమ్ ఫైల్ చేయగలరని నిర్ధారించడం కోసం అవసరమైన చర్యలు తీసుకోవడం ముఖ్యం. ఈ దశలను అనుసరించడం మరియు మీ సమగ్ర ఇన్సూరెన్స్ పాలసీ గురించి తెలుసుకుని ఉండడం ద్వారా, హిట్-అండ్-రన్ సంఘటన జరిగిన సందర్భంలో మీకు రక్షణ ఉంటుందని తెలుసుకుని మీరు మనశ్శాంతిగా ఉండవచ్చు. * ప్రామాణిక నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి ఇన్సూరెన్స్ అనేది ఆసక్తి అభ్యర్థనకు సంబంధించిన విషయం. ప్రయోజనాలు, మినహాయింపులు, పరిమితులు, నిబంధనలు మరియు షరతుల గురించి మరిన్ని వివరాల కోసం, దయచేసి విక్రయాన్ని ముగించే ముందు సేల్స్ బ్రోచర్/పాలసీ వర్డింగ్‌ను జాగ్రత్తగా చదవండి.

ఈ ఆర్టికల్ ఉపయోగకరంగా ఉందా? రేటింగ్ ఇవ్వండి

సగటు రేటింగ్ 5 / 5. ఓట్ల లెక్కింపు: 18

ఇప్పటివరకు ఏ ఓట్లు లేవు! ఈ పోస్ట్‌కు రేటింగ్ ఇచ్చే మొదటి వ్యక్తి అవ్వండి.

ఈ ఆర్టికల్ మీకు నచ్చిందా?? మీ స్నేహితులతో షేర్ చేయండి!

మీ ఆలోచనలను షేర్ చేయండి. దిగువన మీ అభిప్రాయం తెలపండి!

రిప్లై ఇవ్వండి

మీ ఇమెయిల్ అడ్రస్ ప్రచురించబడదు. దయచేసి అన్ని వివరాలను పూరించండి