రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్‌: 9152007550 (మిస్డ్ కాల్)

సేల్స్: 1800-209-0144 సర్వీస్ చాట్: +91 75072 45858

ఇంగ్లాండ్

Claim Assistance
Get In Touch
Bike Insurance GST Rates in 2022
ఫిబ్రవరి 19, 2022

భారతదేశంలో బైక్ ఇన్సూరెన్స్ పై జిఎస్‌టి

వస్తువులు మరియు సేవా పన్నును సాధారణంగా జిఎస్‌టి అని పిలుస్తారు, ఇది భారతదేశంలో చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక పన్ను సంస్కరణ. దాదాపు వర్తకం చేయబడే అన్ని వస్తువులు లేదా సేవగా అందించబడే ప్రతీది జిఎస్‌టి పరిధిలో వస్తుంది. కావున, ఇది రోజువారీ వస్తువులపై పన్ను విధింపును సులభతరం చేసే ఒక సానుకూలమైన దశ. బైక్ ఇన్సూరెన్స్ కూడా దీని పరిధిలోకి వస్తుంది. జిఎస్‌టి అమలు చేయడానికి ముందు అనేక రకాల పన్నులు ఉండేవి, ఆ భారాన్ని అంతిమ-వినియోగదారు భరించాల్సి వచ్చేది. బైక్ ఇన్సూరెన్స్ పాలసీల విషయంలోనూ అదే జరిగింది. కానీ, ఇప్పుడు 01st జూలై 2017 నుండి జిఎస్‌టి అమలు చేయబడినందున, ఇది అన్ని వస్తువులు మరియు సేవలపై వర్తించే పన్నును సులభతరం చేసింది. మీరు టూ వీలర్ ఇన్సూరెన్స్‌ను ‌కొనుగోలు చేసినప్పుడు, ఇది మీ బైక్‌కు నష్టపరిహారం చెల్లించడానికి ఇన్సూరెన్స్ కంపెనీలు అందించే ఒక సేవ. అందువల్ల, ఇది జిఎస్‌టి పరిధిలోకి వస్తుంది.

బైక్ ఇన్సూరెన్స్ పై జిఎస్‌టి

జిఎస్‌టి కౌన్సిల్ వివిధ ప్రోడక్టులు మరియు సేవలకు వర్తించే రేట్లను నిర్ణయిస్తుంది. బైక్ లేదా టూ వీలర్ ఇన్సూరెన్స్ అనేది ఒక సర్వీసు కాబట్టి, బైక్ ఇన్సూరెన్స్ ప్రీమియంల కోసం జిఎస్‌టి రేటు 18% వరకు ఉంటుంది. వివిధ రకాల ప్రోడక్టులు మరియు సేవల కోసం జిఎస్‌టి వ్యవస్థలో 0%, 5%, 12%, 18% మరియు 28% అని ఐదు వేర్వేరు రేట్లు ఉంటాయి. గతంలో ఇన్సూరెన్స్ ప్రోడక్టుల కోసం 15% వద్దనున్న సేవా పన్ను రేటు ప్రీమియం మొత్తాన్ని 3% వరకు పెంచింది. పన్ను చట్టాల ప్రకారం జిఎస్‌టి అనేది మార్పుకు లోబడి ఉంటుందని దయచేసి గమనించగలరు. దీనిని ఒక ఉదాహరణ ద్వారా వివరించవచ్చు. జిఎస్‌టి అమలు చేయడానికి ముందు మీరు ఒక బైక్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేసారని అనుకుందాం. దాదాపు రూ. 1000 ఖరీదైన థర్డ్-పార్టీ పాలసీ ప్రీమియం పై 15% పన్ను రేటు విధించబడుతుంది, అప్పుడు పాలసీ మొత్తం రూ. 1150 అవుతుంది. కానీ, జిఎస్‌టి సంస్కరణలు ప్రవేశపెట్టినప్పటి నుండి అదే థర్డ్ పార్టీ బైక్ ఇన్సూరెన్స్ వర్తించే 18% పన్ను రేటు కారణంగా ఇప్పుడు రూ. 1000 పాలసీ కోసం మీకు రూ. 1180 ఖర్చవుతుంది. కానీ, మీరు ఆన్‌లైన్‌లో టూ-వీలర్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేసినప్పుడు, అటువంటి పన్ను రేటులో పెరుగుదలకు పరిహారంగా ఇందులో తగ్గింపును అందిస్తాయి- మీ బైక్ ఇన్సూరెన్స్ ధర. ఈ విధంగా, మీరు ఆన్‌లైన్ ఇన్సూరెన్స్ ప్లాన్లను కొనుగోలు చేసినప్పుడు, మీకు అందించబడిన రాయితీల ద్వారా పెరిగిన పన్ను భారం యొక్క నికర ప్రభావాన్ని తగ్గించగలుగుతారు. మధ్యవర్తులు లేకపోవడం వలన ఇది సాధ్యం అవుతుంది, ఎందుకంటే ఇన్సూరెన్స్ పాలసీలను నేరుగా ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా మీకు విక్రయించబడుతుంది. టూ వీలర్ ఇన్సూరెన్స్ పై జిఎస్‌టి యొక్క ప్రభావం ఉన్నప్పటికీ, సరైన ఇన్సూరెన్స్ ప్లాన్ ఎంచుకోవడం ముఖ్యం. మీరు ఎంచుకోవడానికి రెండు రకాలు అందుబాటులో ఉన్నాయి - థర్డ్ పార్టీ కవర్ మరియు సమగ్ర కవర్. ఒక సమగ్ర ప్లాన్ స్వంత నష్టాలు మరియు థర్డ్ పార్టీ చట్టపరమైన బాధ్యతల కోసం సంపూర్ణ కవరేజ్ అందిస్తుంది. థర్డ్ పార్టీ కవరేజ్‌లో కేవలం మూడవ వ్యక్తి యొక్క చట్టపరమైన బాధ్యతలు మాత్రమే కవర్ చేయబడతాయి. అందుకే దీనిని లయబిలిటీ మాత్రమే ఉన్న పాలసీ అని కూడా పేర్కొంటారు. లయబిలిటీ మాత్రమే ఉన్న పాలసీల కోసం, ప్రీమియంలు Insurance Regulatory and Development Authority of India (IRDAI) ద్వారా నిర్ణయించబడతాయి మరియు అటువంటి ప్రీమియం రేటు పై 18% జిఎస్‌టి విధించబడుతుంది. సమగ్ర ప్లాన్ల కోసం కూడా ఇదే వర్తిస్తుంది, ఇందులో మొత్తం ప్రీమియం అంటే థర్డ్ పార్టీ ప్రీమియం మరియు స్వంత నష్టం ప్రీమియం పై 18% జిఎస్‌టి వసూలు చేయబడుతుంది. జిఎస్‌టి మీ ఇన్సూరెన్స్ కవరేజ్ యొక్క ఖర్చు పై ప్రభావం చూపినప్పటికీ, పాలసీని కొనుగోలు చేయడానికి ఇది నిర్ణయాత్మక అంశం కాకూడదు. ఒక కొనుగోలు పై తుది నిర్ణయం తీసుకునే ముందు మీరు పాలసీ ఫీచర్లతో పాటు చేర్పులు మరియు మినహాయింపులను కూడా పరిగణించాలి. ఇన్సూరెన్స్ అనేది అభ్యర్థనకు సంబంధించిన విషయం. ప్రయోజనాలు, మినహాయింపులు, పరిమితులు, నిబంధనలు మరియు షరతుల గురించి మరిన్ని వివరాల కోసం, దయచేసి విక్రయాన్ని ముగించే ముందు సేల్స్ బ్రోచర్/పాలసీ వర్డింగ్‌ను జాగ్రత్తగా చదవండి.

ఈ ఆర్టికల్ ఉపయోగకరంగా ఉందా? రేటింగ్ ఇవ్వండి

సగటు రేటింగ్ 0 / 5 ఓట్ల లెక్కింపు: 0

ఇప్పటివరకు ఏ ఓట్లు లేవు! ఈ పోస్ట్‌కు రేటింగ్ ఇచ్చే మొదటి వ్యక్తి అవ్వండి.

ఈ ఆర్టికల్ మీకు నచ్చిందా?? మీ స్నేహితులతో షేర్ చేయండి!

మీ ఆలోచనలను షేర్ చేయండి. దిగువన మీ అభిప్రాయం తెలపండి!

రిప్లై ఇవ్వండి

మీ ఇమెయిల్ అడ్రస్ ప్రచురించబడదు. దయచేసి అన్ని వివరాలను పూరించండి