భారతదేశంలో చాలామందికి ఒక కారు కొనుగోలు చేయడం అనేది ఇప్పటికీ ఒక కలగానే ఉంది. మీ కలని సాకారం చేసుకున్న తరువాత, మీ కారుకు తగినటువంటి ఇన్సూరెన్స్‌తో రక్షణ కలిపించుకోవడం ముఖ్యం. చట్టం ప్రకారం థర్డ్-పార్టీ ఇన్సూరెన్స్ కలిగి ఉండటం తప్పనిసరి. అంతేకాకుండా, మీ స్వంత డ్యామేజ్ ఇన్సూరెన్స్‌ను కలిగి ఉండటం మంచిది, దీని వలన యాక్సిడెంట్ జరిగిన సందర్భంలో మీ ఫైనాన్సులకు సంబంధించినంత వరకు మీరు సురక్షితంగా ఉంటారు. థర్డ్-పార్టీ ఇన్సూరెన్స్ మరియు ఓన్ డ్యామేజ్ కవర్ రెండింటినీ కలిగి ఉన్న పాలసీని సమగ్ర పాలసీ అని పేర్కొంటారు. అయితే, ఒక ముఖ్యమైన ప్రశ్న ఏమిటంటే మనం తీసుకునే పాలసీలో ఇన్సూరెన్స్ మొత్తం ఎంత ఉంటుంది? మరియు ఆన్‌లైన్‌లో కార్ ఇన్సూరెన్స్‌ను కొనుగోలు చేయడం సాధ్యమవుతుందా? ఐడివి అనగా ఇన్సూర్డ్ డిక్లేర్డ్ వాల్యూ ఆధారంగా ఇన్సూరెన్స్ మొత్తం నిర్ణయించబడుతుంది. మీరు ఆఫ్‌లైన్ లేదా
కారు ఇన్సూరెన్స్ ఆన్‌లైన్ ను ఎంచుకోవడం అనేది మీ ఎంపిక పై ఆధారపడి ఉంటుంది, కానీ ఒకదానిని ఎంచుకునే ముందు ఆన్‌లైన్‌లో అందించబడే వివిధ ప్లాన్లను సరిపోల్చడం సులభం.
ఇన్సూర్డ్ డిక్లేర్డ్ వాల్యూ అంటే ఏమిటి?
ఐడివి అంటే కార్ ఇన్సూరెన్స్ పాలసీకి సంబంధించిన ఇన్సూరెన్స్ మొత్తం అని మనము ఇంతకముందే చదివాము. ఇది కారు పాడైపోయినా లేదా దొంగిలించబడినా ఇన్సూరెన్స్ కంపెనీ ఇన్సూర్ చేయబడిన వ్యక్తికి చెల్లించే గరిష్ట మొత్తం.
ఇన్సూర్డ్ డిక్లేర్డ్ వాల్యూ ఎలా నిర్ణయించబడుతుంది?
ఒక కొత్త కారు కోసం, ఇన్సూర్డ్ డిక్లేర్డ్ వాల్యూ అనేది తయారీదారు పేర్కొన్న ఎక్స్-షోరూమ్ ధర. గడచిపోయిన ప్రతి సంవత్సరం కోసం డిప్రిసియేషన్ వర్తిస్తుంది. కొత్తగా కొనుగోలు చేసిన కారు పై డిప్రిసియేషన్ 5% కాబట్టి మీ కారు యొక్క గరిష్ట ఐడివి ఎక్స్-షోరూమ్ ధరలో 95% ఉంటుంది. మీరు షోరూమ్ నుండి మీ కారును బయటకు తీసుకొని వచ్చిన వెంటనే, ఐడివి తగ్గుతుంది మరియు 5 సంవత్సరాల వయస్సు గల కారు కోసం 50% రేటు వరకు తగ్గుతుంది అని గమనించండి. డిప్రిసియేషన్ రేటును చూపుతున్న షెడ్యూల్ క్రింద చూపబడింది
కారు వయస్సు |
డిప్రిసియేషన్ రేటు |
ఆరు నెలలకు మించనివి |
5% |
6 నెలల కంటే ఎక్కువ కానీ 12 నెలలకు మించనిది |
15% |
1 సంవత్సరం కంటే ఎక్కువ కానీ 2 సంవత్సరాలకు మించనిది |
20% |
2 సంవత్సరాల కంటే ఎక్కువ కానీ 3 సంవత్సరాలకు మించనది |
30% |
3 సంవత్సరాల కంటే ఎక్కువ కానీ 4 సంవత్సరాలకు మించనది |
40% |
4 సంవత్సరాల కంటే ఎక్కువ కానీ 5 సంవత్సరాలకు మించనది |
50% |
కారు వయస్సు ఐదు సంవత్సరాల కంటే ఎక్కువగా ఉంటే, ఇన్సూరెన్స్ కంపెనీ మరియు కారు యజమాని మధ్య ఇన్సూరెన్స్ కోసం కారు విలువ పరస్పర చర్చల ద్వారా నిర్ణయించబడుతుంది.
కార్ ఇన్సూరెన్స్‌లో ఐడివి ఎందుకు ముఖ్యం?
మీకు "కార్ ఇన్సూరెన్స్‌లో ఐడివి ఎందుకు ముఖ్యమైనది?" అనే ప్రశ్న ఉంటే దానికి సమాధానం ఇక్కడ ఇవ్వబడింది: ఐడివి అనేది ఇన్సూర్ చేయబడిన వాహనానికి సంబంధించి కారు యజమాని ద్వారా అందించబడే ఒక గరిష్ట క్లెయిమ్ మొత్తం. ఐడివి ఎక్కువగా ఉంటే, ప్రమాదం లేదా ఇతర క్లెయిమ్ చేయదగిన సంఘటనల సంభవించినప్పుడు అధిక మొత్తాన్ని క్లెయిమ్ చేయడం సాధ్యమవుతుంది. ఆ సందర్భాల్లో ఐడివి రెండు పార్టీల మధ్య పరస్పరం నిర్ణయించబడుతుంది కాబట్టి 5 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న కారు కోసం అధిక ఐడివి కలిగి ఉండటం సాధ్యమవుతుంది. పరస్పరం చర్చించుకొని నిర్ణయించిన ఐడివి సాధారణంగా 15% వరకు ఉంటుంది.
ఇన్సూర్డ్ డిక్లేర్డ్ వాల్యూ ఇన్సూరెన్స్ ప్రీమియంను ప్రభావితం చేస్తుందా?
ఇన్సూర్డ్ డిక్లేర్డ్ వాల్యూ అనేది ఇన్సూరెన్స్ ప్రీమియంతో నేరుగా సంబంధం కలిగి ఉంటుంది. సాధారణంగా, ఇన్సూరెన్స్ ప్రీమియం ఐడివి లో 2%-3% ఉంటుంది. అందువల్ల అధిక ఐడివి అనేది అధిక ఇన్సూరెన్స్ ప్రీమియంను సూచిస్తుంది. కాబట్టి మీకు తక్కువ ప్రీమియం కావాలనుకుంటే, తక్కువ ఐడివి విలువను ఎంచుకోవడం సురక్షితం. కానీ దీని అర్థం మీకు తక్కువ ఇన్సూరెన్స్ మొత్తం ఉంటుంది, మరియు మీ క్లెయిమ్ మొత్తం ఇన్సూర్ చేయబడిన మొత్తాన్ని మించితే మీకు పూర్తి మొత్తం చెల్లించబడకపోవచ్చు.
నా కారు యొక్క పూర్తి ఇన్సూర్డ్ డిక్లేర్డ్ వాల్యూ నాకు ఎప్పుడు చెల్లించబడుతుంది?
మీకు ఇన్సూర్ చేయబడిన మొత్తం పూర్తిగా పొందగల సందర్భాలు రెండు ఉంటాయి. మొదటి సందర్భం మీ కారు దొంగిలించబడినప్పుడు. మీ వాహనం దొంగిలించబడితే, అప్పుడు దీర్ఘకాలిక శోధన మరియు పోలీస్ డాక్యుమెంటేషన్ తర్వాత, ఇన్సూరెన్స్ కంపెనీ మీ క్లెయిమ్ కోసం పూర్తి మొత్తాన్ని చెల్లిస్తుంది. రెండవ సందర్భం ఏంటంటే మీ సింగిల్ క్లెయిమ్ మొత్తం ఇన్సూర్ చేయబడిన మొత్తంలో 75% ని మించినప్పుడు. మీ సింగిల్ క్లెయిమ్ మొత్తం ఐడివి లో 75% ని మించితే, ఇన్సూరెన్స్ కంపెనీ దానిని పూర్తి నష్టం పరిస్థితిగా ఊహించి మీకు పూర్తి మొత్తాన్ని చెల్లిస్తుంది. ఇక్కడ మీరు మినహాయించదగిన మొత్తాన్ని పూర్తిగా చెల్లించవలసి ఉంటుందని గుర్తుంచుకోవడం ముఖ్యం.
నాకు ఏ పాలసీ ఉత్తమంగా సరిపోతుంది?
అందించబడే వివిధ
మోటార్ ఇన్సూరెన్స్ రకాలు నుండి, పాలసీ యొక్క ఐడివికి దగ్గరలో దాని ప్రస్తుత మార్కెట్ విలువను కలిగి ఉన్న పాలసీ మీకు సరిపోతుంది, ఎందుకంటే ఇది మీ కారుకు ఏదైనా జరిగితే మీకు ఉత్తమ రక్షణను అందిస్తుంది. అందువల్ల, తగిన ప్రీమియం రేట్ల వద్ద మీ కారు కోసం సరైన విలువను ఏర్పాటు చేయడానికి
ఇన్సూరెన్స్‌లో ఐడివి అంటే ఏమిటి అని తెలుసుకోవడం తప్పనిసరి.
తరచుగా అడిగే ప్రశ్నలు:
నేను ఒకే పాలసీ సంవత్సరంలో ఒకసారి కంటే ఎక్కువ సార్లు కార్ ఇన్సూరెన్స్‌ను క్లెయిమ్ చేయవచ్చా?
అవును, ఒక పాలసీ సంవత్సరంలో ఒకసారి కంటే ఎక్కువ సార్లు కార్ ఇన్సూరెన్స్‌ను క్లెయిమ్ చేయడం సాధ్యమవుతుంది, అయితే ఆ పూర్తి క్లెయిమ్ మొత్తం ఇన్సూర్ చేయబడిన మొత్తాన్ని మించకూడదు.
ఇన్సూరెన్స్ కంపెనీ అధిక ఐడివి కోసం అంగీకరించింది, తరువాత క్లెయిమ్ మొత్తం సాధారణ ఐడివి ని మించింది కానీ అంగీకరించిన ఐడివి కంటే తక్కువగా ఉంది. ఇన్సూరెన్స్ కంపెనీ ఈ ప్రాతిపదికన క్లెయిమ్‌ను తిరస్కరించవచ్చా?
లేదు, అంగీకరించిన ఐడివి లోపు ఉంటే, సాధారణ ఐడివి ని క్లెయిమ్ మించింది అనే దాని ఆధారంగా ఇన్సూరెన్స్ కంపెనీ క్లెయిమ్‌ని తిరస్కరించలేదు.
రిప్లై ఇవ్వండి