రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్‌: 9152007550 (మిస్డ్ కాల్)

సేల్స్: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 సర్వీస్ చాట్: +91 75072 45858

ఇంగ్లాండ్

Claim Assistance
Get In Touch
Bike Insurance For Old Vehicles
మే 23, 2022

15 సంవత్సరాల కంటే పాతవైన బైక్‌ల కోసం టూ వీలర్ ఇన్సూరెన్స్ ఎలా పొందాలి?

జీవితంలో కొన్ని కొనుగోళ్లు విలువైనవి మరియు మనస్సుకు దగ్గరగా ఉంటాయి. ముఖ్యంగా మన స్వంత డబ్బుతో మనము కొనుగోలు చేసినవి. అవి పాతబడిపోయి, ఉపయోగించలేని విధంగా అయినప్పటికీ, వాటితో ఉన్న భావోద్వేగ సంబంధం కారణంగా వాటిని వదిలివేయడం కష్టంగా ఉంటుంది. మనలో చాలా మందికి మన మొదటి బైక్ లేదా టూ వీలర్‌ని జీవిత కాలం పాటు గుర్తుపెట్టుకుంటాం. మొట్టమొదటి బైక్‌ను వదులుకోవడం కష్టం అయినప్పటికీ అనేక మంది దానిని సుదీర్ఘ కాలం పాటు అట్టిపెట్టుకుంటారు, దానిని విక్రయించినా నామమాత్రపు ధర లభించడమే దీనికి కారణం. కాబట్టి, ఒకవేళ దానిని సుదీర్ఘ కాలం పాటు అట్టిపెట్టుకోవడానికి ప్లాన్ చేస్తున్నట్లయితే, దానిని ఇన్సూర్ చేయించుకోవడం తెలివైన నిర్ణయం.

పాత టూ-వీలర్ల చుట్టూ నిబంధనలు

ప్రతి కొత్త వాహనం కోసం 15 సంవత్సరాలపాటు చెల్లుబాటు అయ్యే రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ జారీ చేయబడుతుంది. మోటారు వాహనాల చట్టం ప్రకారం, అన్ని వాహనాలు 15 సంవత్సరాలు పూర్తి అయిన తరువాత సరికొత్త రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ పొందాలి, అంటే రీ-రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఆర్‌టిఒ దానిని అదనంగా ఐదు సంవత్సరాలపాటు రెన్యూ చేస్తుంది, ఇది వాహనాన్ని డ్రైవ్ చేయడానికి అనుకూలంగా మరియు సురక్షితంగా ఉంటుందని ప్రకటిస్తుంది. ఈ అవసరాలు రిజిస్ట్రేషన్‌కు సంబంధించినప్పటికీ, ఇన్సూరెన్స్ కూడా మొత్తం వ్యవధికి అనుగుణంగా ఉండాలి. ఈ చట్టం బైక్ ఇన్సూరెన్స్‌ను తప్పనిసరి ఆవశ్యకంగా చేస్తుంది. వివిధ రకాల ఇన్సూరెన్స్ ప్లాన్‌లలో, థర్డ్ పార్టీ బైక్ ఇన్సూరెన్స్ అనేది కనీస అవసరం, మరియు అన్ని టూ-వీలర్లు వారి వాహనాన్ని దీనితో ఇన్సూర్ చేయవలసి ఉంటుంది.

15-సంవత్సరాల వయస్సు గల బైక్ కోసం టూ-వీలర్ ఇన్సూరెన్స్ ఎందుకు పొందాలి?

యంత్రాలు పాతవి అయ్యే కొద్దీ, అవి సాఫీగా పనిచేయడానికి వాటి నిర్వహణ కీలకం. ఇంజిన్ బైకులో కీలకమైన భాగం కాబట్టి, పాత బైక్‌లను తరచుగా మరమ్మతు చేయవలసిన అవసరం ఉండవచ్చు. అందువల్ల, అటువంటి పాత బైక్‌ల కోసం నిరంతర రెన్యూవల్ చేయడం అవసరం. అదనంగా, 15 సంవత్సరాల కంటే పాత బైక్‌ల కోసం ఒక ఇన్సూరెన్స్ పాలసీ ఈ క్రింది రకాల ప్రమాదాల నుండి రక్షణ కల్పిస్తుంది:
  • అగ్నిప్రమాదాల వలన కలిగిన నష్టాలు లేదా ఇంజిన్‌కు జరిగిన ఇతర నష్టాలు.
  • వాటి యాంటీక్ విలువ కోసం దొంగతనం చేయబడటం.
  • మూడవ వ్యక్తికి గాయం లేదా వారి ఆస్తికి నష్టం కారణంగా చట్టపరమైన బాధ్యత.
*ప్రామాణిక నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి

15 సంవత్సరాల వయస్సు గల బైక్ కోసం టూ వీలర్ ఇన్సూరెన్స్‌ను రెన్యూ చేసేటప్పుడు గమనించవలసిన విషయాలు

ముఖ్యంగా 15 సంవత్సరాల కంటే పాత బైక్‌ను ఇన్సూర్ చేసేటప్పుడు, పరిగణించవలసిన కొన్ని విషయాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి:

1. బైక్ వినియోగం

ఒక పాత బైక్ కోసం బైక్ ఇన్సూరెన్స్ రెన్యూవల్ సమయంలో గుర్తుపెట్టుకోవలసిన అంశం వాహనం యొక్క వినియోగం. వాహనం వయస్సు పెరిగే కొద్దీ, మీరు సుదీర్ఘ పర్యటనల కోసం దానిని తీసుకొని వెళ్లాలని అనుకోరు. బదులుగా, మీరు దానిని నగరంలో ప్రయాణించడానికి ఉపయోగించవచ్చు. కాబట్టి, దాని వినియోగాన్ని దృష్టిలో ఉంచుకుని, సరైన ఇన్సూరెన్స్ పాలసీని ఎంచుకోవడం చాలా ముఖ్యం.

2. ఎంచుకోవలసిన ఇన్సూరెన్స్ పాలసీ రకం

వినియోగం గురించి మీకు స్పష్టత ఏర్పడిన తరువాత, పాలసీ కోసం సరైన ఎంపిక చేసుకోవడం ముఖ్యం. థర్డ్-పార్టీ ప్లాన్లు మరియు సమగ్ర పాలసీలు అనేవి ఎంచుకోవడానికి అందుబాటులో ఉన్న రెండు రకాల ఇన్సూరెన్స్ కవర్లు. థర్డ్-పార్టీ ప్లాన్‌లు చట్టపరమైన బాధ్యతల కోసం పరిమిత కవరేజీని అందిస్తాయి, అయితే సమగ్ర ప్లాన్‌లు మరమ్మతులతో సహా జరిగిన నష్టాలకు విస్తృతమైన కవరేజీని అందిస్తాయి.

3. సరైన ఐడివి ఎంచుకోవడం

మీరు 15 సంవత్సరాల తర్వాత సమగ్ర బైక్ ఇన్సూరెన్స్ ఎంచుకుంటే, మీరు సరైన ఇన్సూర్డ్ డిక్లేర్డ్ వాల్యూ (ఐడివి) ఏర్పాటు చేసుకోవాలి. ఇది మీ బైక్ యొక్క ప్రస్తుత విలువను సూచిస్తుంది మరియు పూర్తి నష్టం జరిగిన సందర్భంలో ఇన్సూరర్ ద్వారా పరిహారం అందించబడుతుంది. అంతేకాకుండా, Insurance Regulatory and Development Authority of India (IRDAI) అటువంటి ఐడివి ని పొందడానికి డిప్రిసియేషన్ రేట్లను కేవలం ఐదు సంవత్సరాల వరకు మాత్రమే పేర్కొంటుంది, ఆ తర్వాత మీరు ఇన్సూరెన్స్ కంపెనీతో చర్చించి దాని గురించి నిర్ణయం తీసుకోవాలి. అందువల్ల, అటువంటి పాత బైక్ కోసం సరైన ఐడివి ని ఏర్పాటు చేయడం అనేది నష్టం జరిగిన సందర్భంలో పరిహారం అందుకోవడానికి సహాయపడుతుంది.

4. పాలసీ నిబంధనలను క్షుణ్ణంగా తెలుసుకోవడం

మీ ఇన్సూరెన్స్ ప్లాన్‌లో ముఖమైన సమాచారాన్ని చదవమని సలహా ఇవ్వబడుతుంది, ఇది బైక్ ఇన్సూరెన్స్ పాలసీ అంశాలను, క్లెయిమ్ సమయంలో మీరు చెల్లించవలసిన ఏదైనా మొత్తంతో సహా, వివరంగా అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. 15-సంవత్సరాల బైక్ కోసం టూ-వీలర్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను ఎలా ఎంచుకోవాలి అనేదానిపై ఈ విభిన్న చిట్కాలతో, మీ బైక్ కోసం మీరు చట్టపరమైన మరియు ఆర్థిక రక్షణను పొందవచ్చు.   ఇన్సూరెన్స్ అనేది అభ్యర్థనకు సంబంధించిన విషయం. ప్రయోజనాలు, మినహాయింపులు, పరిమితులు, నిబంధనలు మరియు షరతుల గురించి మరిన్ని వివరాల కోసం, దయచేసి విక్రయాన్ని ముగించే ముందు సేల్స్ బ్రోచర్/పాలసీ వివరాలను జాగ్రత్తగా చదవండి.

ఈ ఆర్టికల్ ఉపయోగకరంగా ఉందా? రేటింగ్ ఇవ్వండి

సగటు రేటింగ్ 5 / 5. ఓట్ల లెక్కింపు: 18

ఇప్పటివరకు ఏ ఓట్లు లేవు! ఈ పోస్ట్‌కు రేటింగ్ ఇచ్చే మొదటి వ్యక్తి అవ్వండి.

ఈ ఆర్టికల్ మీకు నచ్చిందా?? మీ స్నేహితులతో షేర్ చేయండి!

మీ ఆలోచనలను షేర్ చేయండి. దిగువన మీ అభిప్రాయం తెలపండి!

రిప్లై ఇవ్వండి

మీ ఇమెయిల్ అడ్రస్ ప్రచురించబడదు. దయచేసి అన్ని వివరాలను పూరించండి