రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్‌: 9152007550 (మిస్డ్ కాల్)

సేల్స్: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 సర్వీస్ చాట్: +91 75072 45858

ఇంగ్లాండ్

Claim Assistance
Get In Touch
Ways to Strengthen Your Mental Health
ఏప్రిల్ 12, 2021

మెంటల్ హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్

ఒక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేయడం ద్వారా మీ అన్ని వైద్య అవసరాలు నెరవేర్చబడతాయి. అది మీ జీవిత భాగస్వామి, పిల్లలు లేదా తల్లిదండ్రులు అయినా సరే, హెల్త్ ప్లాన్లు మీ అవసరాలకు అనుగుణంగా పాలసీని కస్టమైజ్ చేసుకోవడంలో మీకు సహాయపడతాయి. కానీ మానసిక ఆరోగ్యం సంగతి ఏమిటి? మీ ప్రియమైనవారు ఏవైనా మానసిక అనారోగ్యాల కోసం కవర్ చేయబడతారా? అనేక ఇన్సూరెన్స్ సంస్థలు గతంలో మానసిక ఆరోగ్య పరిస్థితులను మినహాయింపుల కింద చేర్చేవారని తెలుసు, కానీ ఇకపై అలా జరగదు. మెంటల్ హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ గురించి ఇక్కడ సంక్షిప్తంగా ఇవ్వబడింది.   మెంటల్ హెల్త్ ఇన్సూరెన్స్ కింద ఏమి కవర్ చేయబడుతుంది? ఇటీవలి కాలంలో మానసిక ఆరోగ్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది, అనారోగ్య తీవ్రత పై దృష్టి సారిస్తున్నారు. ఇకపై దీనిని నిర్లక్ష్యం చేయకూడదు మరియు దీనిని చాలా మంది ఎదుర్కొనే ఒక తీవ్రమైన సమస్యగా పరిగణించాలి. Insurance Regulatory and Development Authority (IRDAI) కొద్ది సమయంలోనే మానసిక ఆరోగ్య కవరేజీని ఇన్సూరెన్స్‌లో చేర్చే దిశగా కసరత్తు చేసింది, చివరగా మానసిక ఆరోగ్య సంరక్షణ చట్టం, 2017 ని అమలులోకి తెచ్చింది. అటువంటి అనారోగ్యాలతో బాధపడుతున్న వ్యక్తులకు సరైన మానసిక ఆరోగ్య సంరక్షణ మరియు సేవలను అందించేందుకు ఈ చట్టం కృషి చేసింది. మానసిక ఆరోగ్య సంరక్షణ చట్టం, 2017 మానసిక అనారోగ్యాన్ని "ఆలోచన, మానసిక స్థితి, అవగాహన, ధోరణి యొక్క తీవ్రమైన లోపం లేదా తీర్పు, ప్రవర్తనను తీవ్రంగా ప్రభావితం చేసే జ్ఞాపకశక్తి , వాస్తవికతను గుర్తించే సామర్థ్యం లేని లేదా జీవితంలో సాధారణ అవసరాలను తీర్చే సామర్థ్యం లేని, మద్యం మరియు మాదకద్రవ్యాల దుర్వినియోగంతో ప్రభావితమైన మానసిక పరిస్థితిగా నిర్వచించింది, అయితే, బుద్ధి మాంద్యము అంటే పరిపక్వత చెందని మేధస్సు ఉన్న పరిస్థితిని తీవ్రమైన మానసిక రుగ్మతగా పరిగణలోకి తీసుకోలేదు". అందువల్ల, మీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ మానసిక హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీని కలిగి ఉండాలి, అది మీ మానసిక పరిస్థితి పైన పేర్కొన్న ఏదైనా ప్రమాణాల కిందకు వస్తే క్లెయిమ్ ఫైల్ చేసేందుకు అనుమతించేలా ఉండాలి.   మెంటల్ హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ కింద ఏమి కవర్ చేయబడదు? చట్టపరమైన నిర్వచనం ప్రకారం, మీరు తెలుసుకోవలసిన రెండు స్పష్టమైన మినహాయింపులు ఉన్నాయి. మొదటిది వ్యక్తి ఏ రకమైన మానసిక మాంద్యాన్ని అనుభవిస్తున్నాడు అని, రెండవది మద్యం లేదా మాదకద్రవ్యాల దుర్వినియోగం కారణంగా ఉత్పన్నమైన మానసిక రుగ్మతలు. అలాగే, మెంటల్ హెల్త్ ఇన్సూరెన్స్, హాస్పిటలైజేషన్ కారణంగా తలెత్తే వైద్య ఖర్చులను మాత్రమే కవర్ చేస్తుంది, అంటే వైద్య సంప్రదింపులు లాంటి అవుట్-పేషెంట్ చికిత్స కవర్ చేయబడదు. మీరు మీ హెల్త్ ప్లాన్లలో కొన్ని మానసిక అనారోగ్యాలకు సంబంధించి ప్రత్యేక మినహాయింపులను చూడవచ్చు, వాటిలో చాలా వరకు వెయిటింగ్ పీరియడ్‌లు ఉండవచ్చు. మీరు ముందు నుండి ఉన్న అనారోగ్య పరిస్థితి మాదిరిగానే, ముందు నుండి ఉన్న మానసిక రుగ్మతకు సంబందించిన నిబంధనలను కూడా పరిశీలించాల్సి ఉంటుంది. అందువల్ల, మీ పాలసీ డాక్యుమెంట్లను జాగ్రత్తగా పరిశీలించి, నిబంధనలు మరియు షరతులతో పాటు మినహాయింపులను కూడా అర్థం చేసుకోవాలని సిఫార్సు చేయడమైనది.   మెంటల్ హెల్త్ ఇన్సూరెన్స్ గురించి మీరు తెలుసుకోవాల్సిన పూర్తి విషయాలు   మెంటల్ హెల్త్ క్లెయిమ్‌ను ఫైల్ చేయడానికి అవసరమైన హాస్పిటలైజేషన్ యొక్క కనీస వ్యవధి ఎంత? మీరు కనీసం 24 గంటల పాటు హాస్పిటలైజ్ అయిన సందర్భంలో మాత్రమే, మెంటల్ హెల్త్ ఇన్సూరెన్స్ కింద ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఫైల్ చేయవచ్చు.   ఇన్సూరెన్స్ కంపెనీలు మెంటల్ హెల్త్ కవరేజ్ కింద ఒపిడి లేదా కన్సల్టేషన్ ఛార్జీలను కవర్ చేస్తాయా? చట్టపరమైన మార్గదర్శకాలు ఒక అనారోగ్యం శారీరకంగా లేదా మానసికంగా ఉన్నందున, దానిపై ఎలాంటి వివక్ష చూపకూడదని ఆదేశించినప్పటికీ, ఇది ఒక ఇన్సూరెన్స్ సంస్థ నుండి మరొకరికి మారుతూ ఉంటుంది. అయితే, అనేక ఇన్సూరెన్స్ కంపెనీలు శారీరక అనారోగ్యాల కోసం అవుట్-పేషెంట్ చికిత్సను కవర్ చేయవు, కాబట్టి, మీ ఇన్సూరర్‌తో వాటిని చెక్ చేసుకోవాలని సలహా ఇవ్వడమైనది.   మానసిక ఆరోగ్య రుగ్మతల జాబితా కింద ఏ అనారోగ్యాలు కవర్ చేయబడతాయి? ఈ జాబితా కిందకు వచ్చే కొన్ని ప్రధాన మానసిక అనారోగ్యాలు ఇలా ఉన్నాయి:
  • బైపోలార్ రుగ్మత
  • తీవ్రమైన డిప్రెషన్
  • యాంగ్జైటీ డిజార్డర్
  • షిజోఫ్రేనియా
  • మానసిక రుగ్మత
  • సైకోటిక్ రుగ్మత
  • పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్
  • అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్
  • ఏకాగ్రత-లోటు/ హైపర్ యాక్టివిటీ డిజార్డర్
  మానసిక ఆరోగ్య వ్యాధుల చేర్పు అంటే ఏమిటి? మీ హెల్త్ ప్లాన్‌లో మానసిక రుగ్మతలను చేర్చడం అంటే, మీరు మానసిక వ్యాధుల కోసం కవర్ చేయబడినప్పుడు ఇన్సూరర్ మీ క్లెయిమ్‌ను తిరస్కరించలేరని అర్థం. అలాగే, ఒక వేళ హెల్త్ ప్లాన్ కొనుగోలు చేసిన తర్వాత మీకు ఏదైనా రుగ్మత ఉన్నట్లు నిర్ధారణ అయినా, మీరు విజయవంతంగా క్లెయిమ్ చేయవచ్చు. అయితే, పాలసీ కింద ముందు నుండి ఉన్న మానసిక అనారోగ్యాలను కవర్ చేయడానికి ఇన్సూరెన్స్ సంస్థ ఎలాంటి బాధ్యత వహించదని మీరు తెలుసుకోవాలి, అలాగే, పాలసీని కొనుగోలు చేయడానికి ముందు అన్ని నిబంధనలు మరియు షరతులను పరిశీలించి, మీ ఇన్సూరెన్స్ సంస్థతో మీ సందేహాలను తీర్చుకోండి.

ఈ ఆర్టికల్ ఉపయోగకరంగా ఉందా? రేటింగ్ ఇవ్వండి

సగటు రేటింగ్ 5 / 5. ఓట్ల లెక్కింపు: 18

ఇప్పటివరకు ఏ ఓట్లు లేవు! ఈ పోస్ట్‌కు రేటింగ్ ఇచ్చే మొదటి వ్యక్తి అవ్వండి.

ఈ ఆర్టికల్ మీకు నచ్చిందా?? మీ స్నేహితులతో షేర్ చేయండి!

మీ ఆలోచనలను షేర్ చేయండి. దిగువన మీ అభిప్రాయం తెలపండి!

రిప్లై ఇవ్వండి

మీ ఇమెయిల్ అడ్రస్ ప్రచురించబడదు. దయచేసి అన్ని వివరాలను పూరించండి