మోటార్ వాహనాల చట్టం ప్రకారం, వెహికల్ ఇన్సూరెన్స్ తప్పనిసరి. వెహికల్ ఇన్సూరెన్స్ తప్పనిసరి అయినప్పటికీ, అలాంటి కవరేజ్ పొందడం వలన కలిగే ప్రయోజనాలను మీరు తెలుసుకోవాలి. ఒక యాక్సిడెంట్ సందర్భంలో మీరు మరియు థర్డ్ పార్టీతో సహా ఇద్దరు వ్యక్తులు ప్రమాదంలో పాల్గొంటారు. చట్టం ప్రకారం, ప్రాథమిక థర్డ్-పార్టీ ఇన్సూరెన్స్ కవరేజ్ అవసరం. అయితే, ఒక సమగ్ర ప్లాన్‌లో పెట్టుబడి పెట్టాల్సిందిగా సలహా ఇవ్వబడుతుంది. ఎందుకంటే, థర్డ్-పార్టీ కవర్‌కు అదనంగా ఈ పాలసీలు మీకు లేదా మీ వాహనానికి జరిగిన నష్టాన్ని కవర్ చేస్తాయి. అత్యంత తగిన
వెహికల్ ఇన్సూరెన్స్ ను ఎంచుకోవడం కొంచెం కష్టంగా అనిపించవచ్చు. తరచుగా, మీరు లాభదాయకమైన మరియు తక్కువ ప్రీమియంలో వచ్చే ఇన్సూరెన్స్‌ను ఎంచుకుంటారు. సరైన నిర్ణయం తీసుకోవడంలో మీకు సహాయపడటానికి ఒక ఆన్‌లైన్ వెహికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం కాలిక్యులేటర్ ఉపయోగకరంగా ఉంటుంది.
ఆన్‌లైన్ మోటార్ ఇన్సూరెన్స్ కాలిక్యులేటర్ ప్రయోజనాలు
- ఇది ప్రీమియం మరియు ఇతర నిబంధనలు, షరతులను అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది
ఒక ఆన్‌లైన్ వెహికల్ ఇన్సూరెన్స్ కాలిక్యులేటర్ ప్రీమియం మొత్తాన్ని నిర్ణయించడంలో మీకు సహాయపడుతుంది. అదనంగా, మీరు వెహికల్ ఇన్సూరెన్స్ పాలసీకి సంబంధించి ఇతర నిబంధనలు మరియు షరతుల గురించిన సమాచారాన్ని పొందవచ్చు. ఈ వివరాలను మీరు అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం, ఎందుకంటే ఇవి ప్రీమియంను ప్రభావితం చేస్తాయి. మీరు అదనపు కవరేజీని ఎంచుకుంటే, అధిక ప్రీమియంను చెల్లించవలసి ఉంటుంది. ఒక ఆన్‌లైన్ మోటార్ ఇన్సూరెన్స్ కాలిక్యులేటర్, ఈ యాడ్-ఆన్‌లు మీకు అవసరమా లేదా అనేది నిర్ణయించడంలో మీకు సహాయపడుతుంది.
- మీ అవసరాలకు అనుగుణంగా కస్టమైజేషన్
మీ అవసరాలు అనేవి ఇతర యజమానుల అవసరాలకు భిన్నంగా ఉండవచ్చు, అలాగే, ఒక ఆన్‌లైన్ వెహికల్ ఇన్సూరెన్స్ కాలిక్యులేటర్ మీ వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా వివిధ ప్లాన్‌లను విశ్లేషించేందుకు మిమ్మల్ని అనుమతిస్తుంది. మీరు పాలసీ నిర్మాణాన్ని అర్థం చేసుకోగలుగుతారు. ప్రైవేటు, అలాగే, కమర్షియల్ వెహికల్ ఇన్సూరెన్స్ మూడు భాగాలను కలిగి ఉంటుంది ; థర్డ్-పార్టీ కవర్, ఓన్ డ్యామేజ్ కవరేజ్ మరియు పర్సనల్ యాక్సిడెంట్ కవర్. కొన్ని ప్లాన్లలో పర్సనల్ యాక్సిడెంట్ కవర్ అనేది ఇన్‌బిల్ట్ కవర్‌గా ఉండవచ్చు, అయితే, ఇతరులు దీనిని ఒక యాడ్-ఆన్ ఫీచర్‌గా అందించవచ్చు. ఒక ప్రాథమిక ప్లాన్ తగినంతగా ఉందా లేదా మీకు అదనపు ఫీచర్లు అవసరమా అని నిర్ణయించడానికి ఒక పోలిక సాధనం మీకు సహాయపడుతుంది.
- వివిధ ప్లాన్లను సరిపోల్చండి
ఒక ఆన్‌లైన్ మోటార్ ఇన్సూరెన్స్ ప్రీమియం కాలిక్యులేటర్ ప్రీమియం మొత్తాన్ని లెక్కించేందుకు మరియు
వెహికల్ ఇన్సూరెన్స్‌ను సమర్థవంతంగా సరిపోల్చేందుకు మిమ్మల్ని అనుమతిస్తుంది. అదనంగా, మీరు వివిధ ఇన్సూరెన్స్ సంస్థల ద్వారా అందించబడే వెహికల్ ఇన్సూరెన్స్ ప్లాన్లలో చేర్చబడిన కవర్లు, క్లెయిమ్ సెటిల్‌మెంట్ నిష్పత్తి మరియు ఇతర నిబంధనలు, షరతులు లాంటి ఫీచర్లను సరిపోల్చవచ్చు. ఆన్‌లైన్ వెహికల్ ఇన్సూరెన్స్ కాలిక్యులేటర్లు అందించే సౌలభ్యాన్ని పెంపొందించుకోవడానికి, ఇక్కడ గుర్తుంచుకోవలసిన కొన్ని ముఖ్యమైన విషయాలు ఉన్నాయి:
- మీ వాహనం రిజిస్ట్రేషన్ తేదీ
- మోడల్ రకం, తయారీ కంపెనీ పేరు మరియు కొనుగోలు సమయంలో చేసిన మొత్తం ఖర్చులు లాంటి వివరాలు
- మీరు మీ కోసం మరియు మీ కుటుంబ సభ్యుల కోసం పర్సనల్ యాక్సిడెంట్ కవరేజ్, రోడ్‌సైడ్ అసిస్టెన్స్ మొదలైనటువంటి అదనపు కవరేజ్ వివరాలను అందించాలి
మీరు మీ కొనుగోలు నిర్ణయాన్ని ఖరారు చేయడానికి ముందు, వివిధ ప్లాన్లను సరిపోల్చడానికి మరియు సరైనది ఎంచుకోవడానికి, మోటార్ ఇన్సూరెన్స్ ప్రీమియం కాలిక్యులేటర్ ద్వారా ఆన్‌లైన్ మోటార్ ఇన్సూరెన్స్ కోట్‌లను సేకరించాలని సిఫార్సు చేయడమైనది. కమర్షియల్ వాహనాల కోసం ఇన్సూరెన్స్ అవసరాలు, ప్రైవేట్ వాహనాల నుండి భిన్నంగా ఉంటాయి. చట్టపరమైన సమస్యలను అధిగమించడానికి, 'యాక్ట్ ఓన్లీ' కవరేజ్ అని కూడా పిలువబడే థర్డ్-పార్టీ కవరేజ్ తప్పనిసరి. ఒక థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ పాలసీ అనేది ప్రమాదం జరిగిన సందర్భంలో మీ వాహనానికి జరిగిన నష్టాలను కవర్ చేయదు. అయితే, థర్డ్-పార్టీ కారణంగా తలెత్తే ఏవైనా బాధ్యతలు లేదా ఆర్థిక నష్టాలు ఈ పాలసీ కింద కవర్ చేయబడతాయని మీరు నిశ్చింతగా ఉంటారు కాబట్టి, ఇది మీకు మనశ్శాంతిని ఇస్తుంది. థర్డ్-పార్టీ కమర్షియల్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది ఇన్సూరర్‌కు మరియు మీకు మధ్య జరిగిన ఒక ఒప్పందం, ఇందులో ఒక యాక్సిడెంట్ సందర్భంలో థర్డ్-పార్టీకి జరిగిన నష్టాల నుండి తలెత్తే ఆర్థిక బాధ్యతల కోసం ఇన్సూరెన్స్ కంపెనీ మీకు నష్టపరిహారం చెల్లించేందుకు అంగీకరిస్తుంది. ఒప్పందంలో, మీరు మొదటి పార్టీగా ఉండగా, ఇన్సూరర్ రెండవ పార్టీగా ఉంటారు మరియు నష్టాలను క్లెయిమ్ చేసే గాయపడిన వ్యక్తి థర్డ్ పార్టీగా పరిగణింపబడతారు. ఈ రకమైన ఇన్సూరెన్స్ పాలసీ మీ వాహనం ప్రమాదానికి గురైతే, ప్రమాదవశాత్తు గాయాలు జరిగితే లేదా థర్డ్ పార్టీ మరణం కారణంగా తలెత్తే బాధ్యతలను కవర్ చేస్తుంది. ఇది థర్డ్-పార్టీ ఆస్తికి జరిగిన నష్టాల ఫలితంగా ఉత్పన్నమయ్యే ఆర్థిక నష్టాలను కూడా కవర్ చేస్తుంది. సరైన కారును లేదా
టూ వీలర్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను ఎంచుకోవడానికి మోటార్ ఇన్సూరెన్స్ కాలిక్యులేటర్‌ను ఉపయోగించండి మరియు మీ పాలసీ నుండి అధిక ప్రయోజనం పొందండి.
రిప్లై ఇవ్వండి