రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్‌: 9152007550 (మిస్డ్ కాల్)

సేల్స్: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 సర్వీస్ చాట్: +91 75072 45858

ఇంగ్లాండ్

Claim Assistance
Get In Touch
Two Wheeler Insurance Online Renewal After Expiry
జూలై 23, 2020

గడువు ముగిసిన టూ వీలర్ ఇన్సూరెన్స్‌ను ఆన్‌లైన్‌లో రెన్యూ చేసుకోవడానికి దశలు

మీ టూ-వీలర్ ఇన్సూరెన్స్ పాలసీని రెన్యూ చేసుకోవడం చాలా ముఖ్యం, ఎందుకనగా ఈ పాలసీ దొంగతనం, చోరీ, ప్రకృతి వైపరీత్యాలు లాంటి ఊహించని సంఘటనలు మరియు మీ బైక్‌కు ప్రమాదం జరిగినప్పుడు థర్డ్-పార్టీ లయబిలిటీల నుండి మిమ్మల్ని రక్షిస్తుంది. టూ వీలర్ ఇన్సూరెన్స్ రెన్యూవల్ వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అవి, ఎన్‌సిబి (నో క్లెయిమ్ బోనస్) మరియు అది మీకు అందించే ఉపశమనం మొదలైనవి. అంతేకాకుండా, గడువు ముగిసిన పాలసీ లేదా బైక్ ఇన్సూరెన్స్ పాలసీ లేని వాహనాన్ని నడపడం భారతదేశంలో చట్టవిరుద్ధం. మీ ప్రస్తుత ఇన్సూరెన్స్ పాలసీ గడువు ముగిసేలోపు టూ వీలర్ ఇన్సూరెన్స్ రెన్యూవల్ తప్పనిసరి. వాస్తవానికి, ఇన్సూరెన్స్ కంపెనీలు పాలసీ గడువు ముగియనున్న తమ కస్టమర్లకు నిరంతరం రిమైండర్లను పంపుతాయి. అయితే, మీరు సకాలంలో దానిని పూర్తి చేయకపోతే, గడువు ముగిసిన తర్వాత ఎల్లపుడూ మీ టూ వీలర్ ఇన్సూరెన్స్‌ను ఆన్‌లైన్‌లో రెన్యూ చేసుకోవచ్చు.

గడువు ముగిసేలోపు మీరు మీ టూ వీలర్ వెహికల్ ఇన్సూరెన్స్‌ను రెన్యూ చేయకపోతే, అప్పుడు అది బ్రేక్-ఇన్ కేసుగా పరిగణించబడుతుంది. మీ పాలసీ ల్యాప్స అయినట్లయితే, పరిణామాలు ఈ కింది విధంగా ఉంటాయి:

  • ఒకవేళ మీ బైక్ ఇన్సూరెన్స్‌ను రెన్యూ చేసుకోవడం ఆన్‌లైన్‌లో చేసినట్లయితే, అప్పుడు మీ వెహికల్ యొక్క తనిఖీ అనేది తప్పనిసరి కాదు. కానీ ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా చెల్లింపును అందుకున్న 3 రోజుల తర్వాత పాలసీ వ్యవధి ప్రారంభమవుతుంది.
  • మీరు, మీ గడువు ముగిసిన టూ వీలర్ ఇన్సూరెన్స్‌ను ఆఫ్‌లైన్‌లో రెన్యూ చేసుకోవాలని ఎంచుకుంటే, అప్పుడు తనిఖీ తప్పనిసరి అవుతుంది మరియు అవసరమైన డాక్యుమెంట్లతో పాటు తనిఖీ కోసం మీరు, మీ ఇన్సూరెన్స్ సంస్థ యొక్క సమీప కార్యాలయానికి మీ బైక్‌ను తీసుకెళ్లాలి.
  • సాధారణంగా, గడువు ముగిసిన తరువాత మీకు టూ వీలర్ ఇన్సూరెన్స్ రెన్యూవల్ కోసం ఈ కింద డాక్యుమెంట్లు అవసరం:
    • మీ మునుపటి ఇన్సూరర్ ద్వారా పంపబడిన మునుపటి పాలసీ కాపీ లేదా రెన్యూవల్ నోటీసు
    • ఆర్‌సి (రిజిస్ట్రేషన్ కార్డ్)
    • ఫోటోలు
    • డ్రైవింగ్ లైసెన్సు
  • మీ వాహనం యొక్క తనిఖీ సంతృప్తికరంగా ఉంటే, ఇన్సూరెన్స్ కంపెనీ 2 పని దినాల్లో కవర్ నోట్‌ను జారీ చేస్తుంది.
  • మీరు మీ గడువు ముగిసిన పాలసీని 90 రోజుల తర్వాత రెన్యూ చేస్తే, అప్పుడు మీరు ఎన్‌సిబి ప్రయోజనాన్ని కోల్పోతారు.
  • ఒకవేళ, మీరు 1 సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువ కాలం తర్వాత మీ ఇన్సూరెన్స్‌ను రెన్యూ చేసినట్లయితే, మీ బ్రేక్-ఇన్ కేసు అండర్ రైటర్‌కు రిఫర్ చేయబడుతుంది.

ఇక్కడ గమనించాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీరు గడువు ముగిసిన టూ వీలర్ ఇన్సూరెన్స్‌ను ఆన్‌లైన్‌లో రెన్యూ చేసేటప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీలు ఎలాంటి అదనపు ఛార్జీలు విధించవు.

గడువు ముగిసిన టూ వీలర్ ఇన్సూరెన్స్‌ను ఆన్‌లైన్‌లో ఎలా రెన్యూ చేయాలి?
గడువు ముగిసిన తర్వాత టూ వీలర్ ఇన్సూరెన్స్ ఆన్‌లైన్ రెన్యూవల్ అనేది చాలా సులభమైన మరియు సరళమైన ప్రక్రియ. మీరు చేయవలసిందల్లా దిగువ పేర్కొన్న మూడు సులభమైన దశలను అనుసరించండి:

  • మీ ఇన్సూరెన్స్ కంపెనీని ఎంచుకోండి - మీరు మీ ప్రస్తుత ఇన్సూరెన్స్ కంపెనీ అందించే సేవలు లేదా ప్రీమియం రేట్లతో సంతృప్తి చెందకపోతే, టూ వీలర్ ఇన్సూరెన్స్ రెన్యూవల్ సమయంలో మీకు ఇన్సూరర్‌ను మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు ఆన్‌లైన్‌లో టూ వీలర్ ఇన్సూరెన్స్‌ను సరిపోల్చవచ్చు, మీ అవసరాలకు తగిన విధంగా సరిపోయే ఉత్తమ డీల్‌ను పొందవచ్చు.
  • మీ వాహన వివరాలను నమోదు చేయండి - మీరు ఎంచుకున్న ఇన్సూరెన్స్ కంపెనీ యొక్క అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి మరియు మీ బైక్/టూ వీలర్ వివరాలను అందించండి. మీరు ఇన్సూరెన్స్ పాలసీ, ఐడివి మరియు మీ పాలసీతో పాటు పొందాలనుకునే యాడ్-ఆన్‌లను ఎంచుకోండి.
  • పాలసీని కొనుగోలు చేయండి - చెల్లింపు చేయండి మరియు పాలసీని కొనుగోలు చేయండి. త్వరలో మీ రిజిస్టర్డ్ మెయిల్ ఐడిపై పాలసీ సాఫ్ట్‌కాపీని అందుకుంటారు.

ఈ సాధారణ దశలు మీ పనిని సులభతరం చేస్తాయని ఆశిస్తున్నాము, మీ గడువు ముగిసిన పాలసీ కోసం లేదా మీ పాలసీ గడువు ముగియడానికి ముందుగానే, ముందు జాగ్రత్తగా ఆన్‌లైన్ బైక్ ఇన్సూరెన్స్‌ను ఎంచుకోండి. ఒక టూ వీలర్ ఇన్సూరెన్స్‌ను కలిగి ఉండటం వల్ల, మీరు లేదా మీ వాహనం ప్రమాదానికి గురైతే, మీ జేబు నుండి భరించాల్సిన భారీ ఖర్చులను దీని ద్వారా ఆదా చేయవచ్చు. అందువల్ల, మీరు మీ ఇన్సూరర్ల నుండి రిమైండర్లను స్వీకరించాలని, సకాలంలో మీ పాలసీని రెన్యూ చేసుకోవాలని సిఫార్సు చేస్తున్నాము. మీ ఖర్చులపై ఒక కన్నేసి ఉంచడానికి, టూ వీలర్ ఇన్సూరెన్స్ ప్రీమియం కాలిక్యులేటర్‌ను ఉపయోగించి మీ టూ వీలర్ ప్రీమియంను లెక్కించండి.

ఈ ఆర్టికల్ ఉపయోగకరంగా ఉందా? రేటింగ్ ఇవ్వండి

సగటు రేటింగ్ 5 / 5. ఓట్ల లెక్కింపు: 18

ఇప్పటివరకు ఏ ఓట్లు లేవు! ఈ పోస్ట్‌కు రేటింగ్ ఇచ్చే మొదటి వ్యక్తి అవ్వండి.

ఈ ఆర్టికల్ మీకు నచ్చిందా?? మీ స్నేహితులతో షేర్ చేయండి!

మీ ఆలోచనలను షేర్ చేయండి. దిగువన మీ అభిప్రాయం తెలపండి!

రిప్లై ఇవ్వండి

మీ ఇమెయిల్ అడ్రస్ ప్రచురించబడదు. దయచేసి అన్ని వివరాలను పూరించండి