రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్‌: 9152007550 (మిస్డ్ కాల్)

సేల్స్: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 సర్వీస్ చాట్: +91 75072 45858

ఇంగ్లాండ్

Claim Assistance
Get In Touch
FAQs on PMFBY
జూన్ 10, 2021

ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన (పిఎంఎఫ్‌బివై) పై తరచుగా అడిగే ప్రశ్నలు

 1. పిఎంఎఫ్‌బివై స్కీమ్ ప్రారంభించడం వెనుక ఉద్దేశం ఏమిటి?

రైతులలో సుస్థిరమైన వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యాలు ఇవి:

 • విస్తృత స్థాయిలో ఏర్పడే విపత్తులు, సీజన్ మధ్యలో ఏర్పడే విపత్తులు, పంటకోత తరువాత జరిగే నష్టం మొదలైనటువంటి దురదృష్టకరమైన సంఘటనల కారణంగా వారు పంటలను కోల్పోయిన/నష్టపోయిన సందర్భంలో రైతులు ఏదైనా ఆర్థిక సమస్యను ఎదుర్కొన్నప్పుడు వారికి మద్దతు ఇవ్వడం.
 • ఈ పథకం వ్యవసాయం యొక్క అన్ని దశల్లో రైతులకు ప్రయోజనాలను అందిస్తుంది, అంటే విత్తడం నుండి పంటకోత విధానాల వరకు.
 • ఈ పథకం ద్వారా అందించబడిన ఆర్థిక మద్దతు రైతులు వ్యవసాయాన్ని వదిలి వేయకుండా మరియు వారి పెట్టుబడి ఇప్పుడు ఇన్సూర్ చేయబడినందున వ్యవసాయం కొనసాగించడానికి వారికి ప్రోత్సాహం లభిస్తుందని భావించబడుతుంది.
 • ఈ స్కీం ప్రారంభం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం సరికొత్త వ్యవసాయ విధానాలను అన్వేషించి వాటి అమలు కోసం రైతులను ప్రోత్సహించడం.

విభిన్నమైన పంటల అభివృద్ధిని మెరుగుపరచడానికి ఇది రైతులలో ఒక ఆరోగ్యకరమైన పోటీని కూడా ప్రోత్సహిస్తుంది.

2. ఏ రైతులు ఈ పథకానికి అర్హులు?

పిఎంఎఫ్‌బివై మరియు ఆర్‌డబ్ల్యుబిసిఐఎస్ పథకం కింద, రుణం పొందిన మరియు రుణ పొందని రైతులు ఇద్దరూ ఇన్సూర్ చేయబడవచ్చు.

3. రుణం పొందిన మరియు రుణం పొందని రైతులు ఎవరు?

నోటిఫై చేయబడిన పంటల కొరకు సీజనల్ అగ్రికల్చరల్ ఆపరేషన్స్ (ఎస్ఎఒ) కోసం ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఆర్థిక సంస్థల నుండి రుణాలను పొందిన రైతులను రుణం పొందిన రైతులు అంటారు. ఏదైనా గుర్తింపు పొందిన ఆర్థిక సంస్థ నుండి ఎటువంటి రుణం తీసుకోని రైతులను రుణం పొందని రైతులుగా సూచించబడతారు.

4. ఈ పథకాల క్రింద ఏ పంటలు ఇన్సూర్ చేయబడతాయి?

ఈ పథకం కింద ఈ క్రింది పంటలు ఇన్సూర్ చేయబడ్డాయి:

 • ఆహార పంటలు (తృణధాన్యాలు, చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు)
 • నూనెగింజలు
 • వార్షిక వాణిజ్య / వార్షిక ఉద్యాన పంటలు
5. పిఎంఎఫ్‌బివై పథకం యొక్క వివిధ భాగాలు ఏమిటి?

పిఎంఎఫ్‌బివై పథకంలో రెండు భాగాలు ఉన్నాయి, ఇవి రైతులకు (రుణం పొందిన మరియు రుణం పొందని) కవరేజ్ అందిస్తాయి:

 • తప్పనిసరి భాగం: స్కీంలో పేర్కొన్న నిబంధనల ప్రకారం రుణం పొందిన రైతులందరూ తప్పనిసరిగా కవర్ చేయబడతారు మరియు వారికి ఇన్సూరెన్స్ అందించబడుతుంది.
 • స్వచ్ఛంద భాగం: ఈ భాగం రుణం పొందని రైతులకు ఐచ్ఛికంగా ఉంటుంది. ఈ భాగాన్ని ఎంచుకోవడానికి విధానం ఇలా ఉంది:
  1. ఈ ప్రయోజనాన్ని పొందాలనుకునే రైతులు పేర్కొన్న కట్‌ఆఫ్ తేదీకి ముందు సమీప బ్యాంక్ / ఇన్సూరెన్స్ కంపెనీ అధీకృత ఛానెల్ భాగస్వామిని సంప్రదించాలి.
  2. వారు ప్రతిపాదన ఫారంను పూరించాలి మరియు అవసరమైన అన్ని డాక్యుమెంట్లతో వారి సేవింగ్ బ్యాంక్ అకౌంట్ మరియు భూమి గుర్తింపు నంబర్ వివరాలను అందించాలి.
  3. రైతులు ఈ ఫారంను ప్రీమియం మొత్తంతో పాటు ఇన్సూరెన్స్ కంపెనీ యొక్క బ్యాంకు/ అధీకృత ఛానల్ భాగస్వామికి సమర్పించాలి.
 6. రైతులు తమ పంటలను ఎక్కడ ఇన్సూర్ చేయవచ్చు?

రుణం పొందిన రైతులు తమ పంట రుణం పొందే బ్యాంకుల ద్వారా తప్పనిసరిగా ఇన్సూర్ చేయబడతారు. రుణం పొందని రైతులు సిఎస్‌సి కేంద్రాలు లేదా ఇన్సూరెన్స్ కంపెనీల కార్యాలయాలను సందర్శించడం ద్వారా వారి పంటను ఇన్సూర్ చేయవచ్చు. రైతులు బ్యాంకులు లేదా ఏజెంట్లు మరియు ఇన్సూరెన్స్ కంపెనీల బ్రోకర్లను కూడా సంప్రదించవచ్చు, లేదా రైతు పోర్టల్‌లో ఆన్‌లైన్‌లో కూడా సంప్రదించవచ్చు.

7. ఈ స్కీం కింద ప్రీమియం ఎలా లెక్కించబడుతుంది?

ఇన్సూరెన్స్ చేయబడిన మొత్తం (ఎస్ఐ) పై యాక్చూరియల్ ప్రీమియం రేటు (ఎపిఆర్) లెక్కించబడుతుంది. ఈ పథకం కింద రైతులు చెల్లించవలసిన గరిష్ట ప్రీమియం రేటు ఈ క్రింది పట్టికను ఉపయోగించి నిర్ణయించబడుతుంది:

సీజన్ పంటలు రైతు ద్వారా చెల్లించవలసిన గరిష్ట ఇన్సూరెన్స్ ఛార్జీలు
ఖరీఫ్ అన్ని ఆహార ధాన్యాలు మరియు నూనెగింజలు ఎస్ఐ లో 2%
రబీ అన్ని ఆహార ధాన్యాలు మరియు నూనెగింజలు ఎస్ఐ లో 1.5%
ఖరీఫ్ మరియు రబీ వార్షిక వాణిజ్య / వార్షిక ఉద్యాన పంటలు శాశ్వత ఉద్యాన పంటలు (పైలట్ ప్రాతిపదికన) ఎస్ఐ లో 5%
  8. ఒక వ్యక్తిగత రైతు కోసం బీమా చేయబడిన మొత్తం ఎలా నిర్ణయించబడుతుంది?

ఈ పథకం కింద ఒక వ్యక్తిగత రైతుకు బీమా చేయబడిన మొత్తాన్ని లెక్కించడానికి సూత్రం ఈ విధంగా ఉంది:

 ఇన్సూరెన్స్ చేయబడిన మొత్తం = ఒక హెక్టారుకు ఇచ్చిన ఫైనాన్స్ మొత్తం * రైతులు వేసిన నోటిఫై చేయబడిన పంట విస్తీర్ణం

9. పిఎంఎఫ్‌బివై స్కీం కింద కవర్ చేయబడే రిస్కులు ఏమిటి?

ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన పథకం ఈ క్రింది ప్రమాదాలను కవర్ చేస్తుంది:

 • విత్తడం / నాటడం నిరోధించబడటం వలన నష్టాలు
 • పెరుగుతున్న దశలో ఉన్న పైరు (విత్తడం నుండి పంటకోత వరకు)
 • పంటకోత తరువాత జరిగే నష్టాలు
 • స్థానికీకరించిన ప్రమాదం
10. విస్తృత స్థాయిలో విపత్తు ఏర్పడిన సందర్భంలో క్లెయిమ్ ఎలా లెక్కించబడుతుంది?

విస్తృత స్థాయిలో విపత్తు ఏర్పడిన సందర్భంలో, ఆ విస్తీర్ణంలో కనీస దిగుబడి (టివై) తో పోలిస్తే ఇన్సూర్ చేయబడిన పంట దిగుబడిలో తరుగుదల విధానం ఆధారంగా రైతుకి చెల్లించబడుతుంది. క్లెయిమ్ ఈ విధంగా లెక్కించబడుతుంది:

(కనీస దిగుబడి - వాస్తవ దిగుబడి) ----------------------------------------------------- * ఇన్సూర్ చేయబడిన మొత్తం కనీస దిగుబడి

 11. ఇన్సూరెన్స్ కంపెనీకి స్థానికీకరించిన నష్టాల గురించి రైతులు ఎలా తెలియజేయవచ్చు?

 విపత్తు జరిగిన 72 గంటల్లోపు నష్టం వివరాలను రైతులు మాకు లేదా సంబంధిత బ్యాంక్ లేదా స్థానిక వ్యవసాయ విభాగం/జిల్లా అధికారులకు తెలియజేయవచ్చు. మీరు టోల్-ఫ్రీ నంబర్ 1800-209-5959 ద్వారా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు.

 12. విత్తడం నిరోధించబడటం కారణంగా జరిగిన నష్టాల విషయంలో ఏమి చేయాలి?

విత్తడం నిరోధించబడటం కారణంగా నష్టం జరిగిన సందర్భంలో ఇన్సూర్ చేయబడిన రైతు, ఇన్సూరెన్స్ కంపెనీకి తెలియజేయవలసిన అవసరం లేదు. ఇది ఒక విస్తృత స్థాయి విపత్తుగా పరిగణించబడుతుంది మరియు విస్తీర్ణం విధానం ఆధారంగా అంచనా వేయబడుతుంది. వాతావరణ పరిస్థితుల కారణంగా చాలామంది రైతులు తమ పంటను విత్తుకోలేకపోయినప్పుడు ఈ ప్రయోజనం ప్రారంభించబడుతుంది.

 13. ప్రధాన్ మంత్రి బీమా ఫసల్ యోజనలో నమోదు చేయడానికి సరైన సమయం ఎప్పుడు?

ఈ పథకం కింద అన్ని నమోదులు ప్రతి రాష్ట్రం యొక్క రాష్ట్ర ప్రభుత్వ నోటిఫికేషన్‌లో పేర్కొన్న విధంగా కట్ఆఫ్ తేదీకి ముందు పూర్తి చేయబడాలి. అలాగే, కట్ఆఫ్ తేదీలోపు రైతు, బ్యాంక్ లేదా మధ్యవర్తి ద్వారా యథోచితముగా పంపిణీ చేయబడిన తన ప్రీమియం యొక్క వాటాను ఇన్సూరెన్స్ కంపెనీకి చెల్లించాలి. నమోదులో ఆలస్యం మరియు కట్ ఆఫ్ తేదీ తరువాత ప్రీమియం చెల్లించడం చేసినట్లయితే, అప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీకి కవరేజీని తిరస్కరించే హక్కు ఉంటుంది.

 14. పిఎంఎఫ్‌బివై పథకం కింద పంటకోత తరువాత నష్టం కింద కవర్ చేయబడే ప్రమాదాలు ఏమిటి?

పంటకోత దిగుబడి నష్టాన్ని వ్యక్తిగత ప్రాతిపదికన/ పొలం మీదుగా అంచనా వేస్తారు. పంట కోత నుండి 14 రోజుల వరకు పంటను ఎండబెట్టడం కోసం పండించిన పంట పొలాల మీద ధాన్యాన్ని "కట్ అండ్ స్ప్రెడ్" స్థితిలో ఉంచినప్పుడు వడగళ్లు, తుఫాను, వరదలు, తుఫాను వర్షాలు మరియు అనాలోచిత వర్షపాతం లాంటి ఊహించని సంఘటనల కారణంగా పంటకోత దిగుబడి నష్టం సంభవిస్తుంది.

 15. ఈ పథకం కింద రైతులకు అందే పన్ను ప్రయోజనాలు ఏమిటి?

ఈ స్కీం సేవా పన్ను నుండి మినహాయించబడింది.

ఈ ఆర్టికల్ ఉపయోగకరంగా ఉందా? రేటింగ్ ఇవ్వండి

సగటు రేటింగ్ 5 / 5. ఓట్ల లెక్కింపు: 18

ఇప్పటివరకు ఏ ఓట్లు లేవు! ఈ పోస్ట్‌కు రేటింగ్ ఇచ్చే మొదటి వ్యక్తి అవ్వండి.

ఈ ఆర్టికల్ మీకు నచ్చిందా?? మీ స్నేహితులతో షేర్ చేయండి!

మీ ఆలోచనలను షేర్ చేయండి. దిగువన మీ అభిప్రాయం తెలపండి!

రిప్లై ఇవ్వండి

మీ ఇమెయిల్ అడ్రస్ ప్రచురించబడదు. దయచేసి అన్ని వివరాలను పూరించండి